▪️వార్తల్లో వ్యక్తులు & క్రీడలు▪️
నీరా టాండన్‌వైట్‌హౌస్ సలహాదారుగా భారత అమెరికన్ నీరా టాండన్ మే 15న నియమితులయ్యారు. డిజిటల్ సేవలు, అందుబాటులోని వైద్య సేవల చట్టంపై అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సలహాలు ఇస్తారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అనే సంస్థకు ఆమె అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
తషి యాంగ్జోమ్
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన తషి యాంగ్జోమ్ మే 15న ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 2021లో ఈ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా ఘనత సాధించారు.
సందేశ్ గుల్హానే
స్కాట్లాండ్‌లో ఎంపీగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్ సందేశ్ గుల్హానే మే 16న ఎన్నికయ్యారు. స్కాటిష్ పార్లమెంటుకు భారత మూలాలున్న వ్యక్తి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
జస్టిస్ లలిత్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ మే 17న నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇదివరకు జస్టిస్ ఎన్‌వీ రమణ ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టడంతో లలిత్‌ను ఎంపిక చేశారు.
ఆండ్రియా మెజా
మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని మియామిలో మే 17న నిర్వహించిన 69వ మిస్ యూనివర్స్ పోటీల్లో 73 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన మిస్ ఇండియా ఎడలిన్ కాస్టిలినో నాలుగో స్థానంలో నిలిచింది.
బాలసుబ్రమణ్యన్
సూపర్‌ఫాస్ట్ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్ రసాయన శాస్త్రవేత్తలు శంకర్ బాలసుబ్రమణ్యం, డేవిడ్ క్లెనెర్‌మన్‌లకు ఫిన్‌లాండ్ నోబెల్ సైన్స్ బహుమతి (మిలీనియన్ టెక్నాలజీ అవార్డు-2020) మే 19న లభించింది. ఈ బహుమతి కింద ఒక మిలియన్ యూరోలు అందిస్తారు.
జస్టిస్ సంయజ్ యాదవ్
అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ (సీజే)గా జస్టిస్ సంజయ్ యాదవ్‌ను సుప్రీంకోర్టు కొలీజియం మే 20న సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.
అద్వైత్ కుమార్
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖలో అండర్ సెక్రటరీగా అద్వైత్ కుమార్ సింగ్ మే 20న నియమితులయ్యారు. ఆయన 2013 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టును తాత్కాలికంగా డౌన్‌గ్రేడ్ చేసి ఆ స్థానంలో ఆయనను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది.
అన్వీ భూటాని
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉప ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వీ భూటాని మే 21న విజయం సాధించారు. 2021-22 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండో భారతీయురాలు.
సురేష్ ముకుంద్
10వ వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు-2020 సురేష్ ముకుంద్‌కు మే 21న లభించింది. వరల్డ్ ఆఫ్ డాన్స్‌లో భాగంగా టీవీ రియాలిటీ షో కాంపిటీషన్ విభాగంలో వరల్డ్ ఆఫ్ సీజన్‌లో ఈ అవార్డు దక్కింది.
🏀క్రీడలు⚽
రఫెల్ నాదల్
10వ ఇటాలియన్ ఓపెన్ టోర్నీని స్పెయిన్ టెన్సిస్ స్టార్ రఫెల్ నాదల్ సాధించాడు. మే 16న నిర్వహించిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నాదల్ నొవాక్ జకోవిచ్‌పై గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా జకోవిచ్ (36 టైటిల్స్) పేరుతో ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌ను 13 సార్లు, బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు, మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్‌ను 11 సార్లు గెలిచాడు.
స్వైటెక్
ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌కు చెందిన ఇగా స్వైటెక్ విజయం సాధించింది. కెరీర్‌లో ఆమెకు ఇది మూడో టైటిల్.
శంకర్‌కు స్వర్ణం
అమెరికాలోని మాన్‌హట్టన్‌లో మే 16న జరిగిన బిగ్12 అవుట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకం సాధించాడు. వెర్నాన్ టర్నర్, జాక్వెన్ హోగన్ రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చదువుతూ అథ్లెటిక్స్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.
బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్
క్రికెట్ మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ మే 17న నియమితులయ్యాడు. పవార్ నేతృత్వంలో అతడు బాధ్యతలు చేపడతాడు. భారత్ తరఫున అతడు 23 టెస్టుల్లో 1326 పరుగులు చేశాడు.
Comments
Post a Comment