మన బ్రెయిన్స్ రెండు విధాలుగా ప్రభావితం అవుతున్నాయి.
1. కొత్త విషయాలు నేర్చుకుని, న్యూరాన్లు, న్యూరల్ నెట్‌వర్క్‌లను బలంగా చేసుకునే ఆసక్తి కోల్పోవడం! మనకు తెలిసిన జ్ఞానమే గొప్ప అని ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో.. అందర్నీ ఖండిస్తూ కొనసాగే మూర్ఖపు యాటిట్యూడ్ వల్ల బ్రెయిన్ చాలా ప్రభావితం అవుతోంది. ఆలోచనాశక్తిని పూర్తిగా కోల్పోతోంది.
2. రోజువారీ పనులు, నిర్ణయాలను ఇప్పటి వరకూ మనం స్వయంగా తీసుకునేవాళ్లం. దాన్ని కూడా మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్‌లోని ఫ్రాంటల్ లోబ్ తన శక్తిని కోల్పోయి పూర్తిగా నిర్వీర్యం అయిపోతోంది.
ఫ్రాంటల్ లోబ్ సామర్థ్యం దెబ్బతింటే ఎంత ప్రమాదమో ఒక చిన్న ఉదాహరణలో చెప్తాను. చాలా గొప్ప క్వాలిటీస్ కలిగి, ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తికి ఒకరోజు కంటి నుండి ఫ్రాంటల్ లోబ్ గుండా వెనక్కి ఓ బలమైన ఐరన్ రాడ్ గుచ్చుకుంది. మెదడు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. మిరాకిల్‌గా అతను బ్రతికాడు. అయితే, ఫ్రాంటల్ లోబ్ దెబ్బ తినడం వల్ల అంతకుముందు మెచ్యూర్డ్‌గా ప్రవర్తించే అతను, తర్వాత ఫూలిష్‌గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఒక ఎమోషన్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నిర్ణయించే ఫ్రాంటల్ లోబ్ నిర్వీర్యమై పోతే మనం కూడా ఫూలిష్‌గా ప్రవర్తిస్తాం. విపరీతంగా అరుస్తాం, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తాం. అదే ఇప్పుడు భవిష్యత్తు తరాలకు జరగబోతోంది.
Comments
Post a Comment