Skip to main content

టీమ్ లక్ష్య నిన్నటి కార్యక్రమం...

కాకర చిన్నా..
సరిగ్గా సంవత్సరం క్రితం..
మన సహచర సంస్థ టీమ్ చేయూత ఒకవైపు..
సామాజిక మాధ్యమాల ద్వారా వందల హృదయాలు తమ ప్రయత్నాలతో మాకు తెల్సిన సమాచారం ప్రకారం 5 నుండి 6 లక్షల రూపాయలతో...
టి.బి.cum వెన్నె ముఖ వ్యాధి నివారణకు చికిత్స చేయించారు...

ఈ సందర్భంగా ఆనాటి టీమ్ చేయూత ప్రయత్నాలకు లక్ష్య టీమ్ తరుపున అభినందనలు తెలుపుతూ..👍

చేసిన సర్జరీ వలన అప్పటి వరకూ సంవత్సరాల తరబడి మంచానికే పరిమితం అయిన కాకర చిన్నా మరలా లేచి అప్పుడే అడుగులు నేర్చుకున్న పసివాడిలా అడుగులు వేశాడు...

వందల హృదయాలు ఈ వార్త విని సంబరపడ్డాయి...
మురిసిపోయాయి...
తమ రూపాయి చిన్నా ఇంట వెలుగుల్ని నింపిందని గర్వపడ్డాయి..

కానీ విధి విచిత్రమైంది..
పోస్ట్ ట్రీట్మెంట్ కి నెలకు 35,000/రూపాయలు అవసరం కాగా...
చిల్లి గవ్వ చేతిలో లేక మరలా యథా స్థితికి చేరాడు...

ఈయనకు ట్రీట్మెంట్ చేస్తే మరలా బతుకు పట్టాలపై పరుగులు తీయగలడు...
ఆయన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం..
అతి త్వరలో మనం ఏమైనా చేయగలమా అనే ఆలోచన మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మిత్రులారా....

ఇప్పటివరకూ...
ఆకలితో యుద్ధం చేస్తున్న చిన్నాకు అనేక మంది దాతలు ప్రతీ నెలా అవసరం అయిన నిత్యావసరాలను అందిస్తున్నారు....వచ్చే నెలకు దాతలు ముందుకు రాకపోవడంతో చిన్నాకు వచ్చే నెలకు అవసరం అయిన 2,500 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను ...మన లక్ష్య టీమ్ ద్వారా అందివ్వడం జరిగిందని మీకు విన్నవిస్తూ....🙏
మీరు ప్రతీ నెలా పంపే జనరల్ ఫండ్ నుండి తీసిన మీ రూపాయి..

ఎప్పటిలానే ఆకలి తీర్చింది...
ఆసరానిచ్చింది...

ఈ సమస్యకు సంబంధించిన నిజ నిర్దారణను నాతో పాటుగా మన టీమ్ కుటుంబ సభ్యులైన శ్రీ కె.వి.కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు.. వారు వెరిఫై చేశాక పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతాను...🙏

మీ
టీమ్ లక్ష్య

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺