శ్రీనివాసరావు ఒక పోలీస్ అయన తన విధుల్లో ఉండగా ఫోన్ మోగింది
"హలో"
మీరు శ్వేత నాన్న గారా??
"అవును మీరు "
"మేము సాయి హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం .
మీ అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యింది .
మీరు వెంటనే బయల్దేరి రాగలరా "
ఏమైందో ఎలా ఉందొ అని భయం భయంగానే హాస్పిటల్ చేరుకున్నాడు శ్రీనివాస్ రావు
రక్తపు మడుగులో ఉన్న కూతురిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
.
ఎవరో ఒక అబ్బాయి తాగి బండి నడిపినట్టు ఉన్నాడు దానికి తోడు అతివేగం మీ అమ్మాయి స్కూటీ ని గుద్దేసాడు
సంఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఇక్కడకు తీసుకు వచ్చారు అని చెప్తూ నర్స్ వెళ్ళిపోయింది
తన కూతురి పరిస్థితికి కారణమైన వాడిని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు
గుండె బాధతో బరువెక్కిపోయింది
కొద్దీ నిముషాలు వెనక్కు వెళ్ళాడు
స్టాప్ స్టాప్
బండిని పక్కకు ఆపు
తాగున్నావా??
లేదు సర్ ..
అబద్ధాలు చెప్పకు
నీ నుండి వస్తున్న మందు కంపుతోనే నాకు మత్తు ఎక్కేలా ఉంది
సర్ అది అది
నిజం తెలిసిందిగా ఇంకా ఏంటి అది అది అని
సర్లే ఎంత ఉందేంటి ??
సర్
తాగి బండి నడపడం తప్పని తెలుసు కదా మళ్ళీ ఏంటి
ఎంతఉంటె అంత ఇచ్చి బండి తీసుకెళ్ళు
100 రూపాయలే ఉంది సర్
పర్లేదు అదే ఇచ్చి వెళ్ళు
అలాగే జేబులో దాచుకున్నాడు
సర్ సర్ ఏంటి ఆలోచిస్తున్నారు
ఈ మందులు వెంటనే తీసుకు రండి అని చీటీ చేతిలో పెట్టింది నర్స్
మందులు కొనడానికి జేబులో గంట క్రితం తీసుకున్న లంచం బయటపడింది
ఇప్పటికి అందులోని గాంధీ తాత నవ్వుతూనే ఉన్నాడు
కాలం ముందు అవమానంతో తల దించుకున్నాడు
ఎటు వచ్చిన డబ్బు ఆటే పోతుంది ఇంకాస్త ఎక్కువగా బాధ పెట్టి
Comments
Post a Comment