Skip to main content

నేటి మోటివేషన్... మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి

సుధాకర్ ఆఫీసులో క్లెర్క్ గా పని చేస్తున్నాడు, మనిషి మంచివాడే కానీ పూర్తిగా భార్యా విధేయుడని మిగతా స్టాఫంతా చెవులు కొరుక్కుంటుటారు
సుధాకర్ ఆరోజు ఎందుకో చాలా చిరాకుగా ఉన్నాడు
.

బాస్ రూం లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సుధాకర్..
బాస్ సుధాకర్ వైపు చూడకుండానే ఫైలు చూసుకుంటూ
“ ఏమయ్యా సుధాకర్? ఏంటి ఇవాళ చిరాగ్గా ఉన్నావ్? ఎనీ ప్రాబ్లెం ?” అడిగాడు
.

“ మీరెలా కనుక్కున్నారు సర్ ?” మనసులో మాట బయటకు అనేసి నాలుక్కరచుకున్నాడు..
.

బాస్ నవ్వుతూ..” నీవు ఎప్పుడూ అంత విసురుగా నా కేబిన్ డోరు తీయలేదు అందుకే అడిగాను ఎనీ ప్రాబ్లం ?”
.

అవును సర్..మా అమ్మ నే ప్రాబ్లం సర్ !
.
.

మీ అమ్మ ప్రాబ్లమా ? ఆశ్చర్యపోయాడు బాస్.
“ఇఫ్ యు డోంట్ మైన్, నీ పర్సనల్ విషయం లో తల దూరుస్తున్నాను అనుకోకపోతే , విషయం ఏమిటో చెప్పగలవా ?”

“ మా అమ్మతో చాలా ప్రాబ్లం గా ఉంటోంది సార్. రాత్రుళ్లు దగ్గుతూ నిద్ర లేకుండా చేస్తుంది. మేం చేసిన వంట ఆమెకు రుచించదు. బాత్రూం అంతా గలీజు చేస్తుంది. ఓక్కోసారి బట్టల్లోనే అన్నీ చేసుకుంటుంది . భరించలేకున్నాం సర్ . నాభార్య తో మా అమ్మ గురించి రోజూ గొడవ పడవలసి వస్తోంది . చివరకు మూడురోజుల క్రితం వ్రుధ్ధాశ్రమం లో జాయిన్ చేసాను . అప్పటినుండి ఈరోజు వరకు భోజనం చేయటం లేదట, వ్రుధ్ధాశ్రమం వారు గంట, గంటకు ఫోన్ చేసి మీ అమ్మను తీసికెళ్ళమని ఫోన్ లతో చంపేస్తున్నారు సర్!” విసుగుకు కారణం చెప్పాడు
.
.
బాస్ సానుభూతి చూపిస్తూ “చాలా సఫర్ అవుతున్నావు సుధాకర్, ఈ చిరాకు పని మీద చూపించకు.. ఓకే.” అన్నారు
.

“నిన్ను ఎందుకు పిలిచా అంటే
నీమీద నమ్మకంతో.. ఈ రెడ్ కలర్ ఫైలు నీకు అప్పగిస్తున్నాను . నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చూపాలి, ఆఫీసులో ఎట్టి పరిస్థితి లో పెట్టరాదు, ఎప్పుడూ నీ వెంటే ఉంచుకోవాలి, ఈ పని నీవు చెయ్యగలవా?”
.
.

“నామీద మీరంత నమ్మకం పట్టుకున్నాక ఈ పని నేను చెయ్యలేక పోవడం ఏంటి సర్? చేస్తాను” అని ఫైలు తీసుకుని బయట పడ్డాడు.

ఓరోజు బాస్ సుధాకర్ తో “మనిద్దరం బెంగుళూరు కు వెళుతున్నాం, ఫైలు తో రెడీగా ఉండు, నీ లగేజ్ సర్జుకుని రమ్మన్నాడు”
.
ఇంతమంది స్టాఫ్ లో నన్నే తీసుకు వెడుతున్నాడు బాస్ అని లోలోపల గర్వంగా కూడా ఫీలయ్యాడుసుధాకర్ . అప్పటికే సుధాకర్ బాస్ కు దగ్గరయ్యాడని స్టాఫ్ లో క్రేజ్ కూడా పెరిగింది, ఇద్దరూ రైలులో ప్రయాణం చేస్తున్నారు, TC గారు టికెట్ చెకింగ్ కు వచ్చారు,బాస్ సుధాకర్ టికెట్స్ చూపించమన్నారు,సుధాకర్ అవాక్కయ్యాడు,నా దగ్గర టికెట్స్ లేవు. ....మీరెప్పుడిచ్చారు ?
.

బాస్ కు చిర్రెత్తుకోచ్చింది,
యూ ఫూల్ ! టికెట్స్ బుక్ చేయమని కూడా నేను నీకు చెప్పాలా ? నీకు తెలియదా ? అనేసరికి గడ,గడ వణికిపోయాడు సుధాకర్.. ఇప్పుడెలా ?
.
.

సర్! మీరెలాగో అడ్జస్ట్ అవండి. నేను టాయ్ లెట్ లో దూరిపోతాను అని బాస్ సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా టాయ్ లెట్ లో దూరిపోయాడు. రాత్రంతా టాయ్ లెట్ కంపుతో వాంతులయ్యాయి. తలపట్టేసింది.
.
.

మెుత్తానికి బెంగుళూరు చేరారు,
.

బెంగుళూర్ లో తనఇంటికి తీసుకెళ్ళాడు సుధాకర్ ను. బాస్ ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది . ముఖ్యం గా బాస్ తల్లిగారు రాజమాతలా ఉన్నారు ...బెడ్ మీద
.

బాస్ ఇంట్లోకి వెళ్తూనే సరాసరి తన తల్లి ఉన్న గది కి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకున్నాడు . ఆమె కళ్ళు తెరచి కొడుకుని చూసి...... ఏరా?... ఇదేనా రావడం?..... భోంచేసావా? “ అంటూ ఆప్యాయంగా పలకరించింది

పసిపిల్లాడిలా ఆమె ముందు నిలబడ్డ తన బాస్ ను చూసి ఈయన మా బాసేనా? అన్న అనుమానం వచ్చింది సుధాకర్ కు, అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వయానా బాస్ భార్యనే దగ్గరుండి అత్తగారికి సపర్యలు చేయడం.
.

సుధాకర్ లో ఇవన్నీ చూసిన వెంటనే తనలో అంతర్మధనం మెుదలైంది,
తనకు, తన బాస్ కు ఎంత తేడా? అంత హోదాలో ఉన్నా కూడా ఇసుమంతైనా విసుగు లేకపోవడం ఎలా సాధ్యం?
ఈ ఆలోచన లతో రాత్రి నిద్ర రాలేదు, తన తల్లి రూపమే కళ్ళముందు కనబడుతుంది.
.

తెల్లారింది.. రాత్రంతా నిద్ర లేక సుధాకర్ కళ్ళు ఎర్రబడ్డాయి..
అక్కడ ఆఫీస్ కి బయలుదేరుతూ “ ఆ ఫైలు తీసుకురా!”

“ సర్! ఇక ఆ ఫైలు నేను మోయలేను, నన్నొదిలెయ్యండి ప్లీజ్..” అన్నాడు

ఏం? అంత బరువు గా ఉందా ఆ ఫైల్?
“ ఫైలు బరువు కాదు! దాన్ని మెయింటైన్ చెయ్యడం కష్టంగా ఉంది సర్..”
బాస్ మెల్లగా లేచి సుధాకర్ భుజం పై చేయి వేసి
“ వంద గ్రాముల బరువు కూడా చెయ్యని ఫైలు ను నీవు కనీసం మూడురోజులు మెుయ్యలేక పోయావే! మరి నిన్ను మీ అమ్మ తన కడుపులో తోమ్మిది నెలలు ఎలా మోసిందంటావ్?
ఊహించని ప్రశ్న కు సుధాకర్ కు దిమ్మ తిరిగిపోయింది.. సర్.. అంటూ నీళ్ళు నమిలాడు.
“ ఎవరెవరో వాడిన టాయ్ లెట్ ను రాత్రంతా భరించావు! మరి నీ కన్నతల్లి వాసనని భరించలేక పోయావా?” ఆమె తిన్న ఆహారం తోనే నీవు ఆమె కడుపులో తొమ్మిది నెలలు బ్రతికావు. అప్పుడు రాలేదా వాసన? నిన్ను కనడానికి ఆమె ఎంత నోప్పి ని భరించిందో నీవు ఊహించగలవా? నీ పుట్టుక తో ఆమె కళాకాంతులు కోల్పోయిన సంగతైనవనీకు తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఆమె నీకు ఊడిగం చేసిందో చెప్పగలవా? నాన్న తన్నుల నుండి నిన్ను ఎన్ని సార్లు కాపాడిందో గుర్తుకు తెచ్చుకో సుధాకర్? సృష్టి లో మనకు బలమైన మద్దతుదారు అమ్మ ఒక్కటే !

నీ కడుపు నింపడానికి ఆమె ఎన్ని సార్లు కడుపు కాల్చుకుందో నీకు తెలుసా? కనీసం ఆ కోణం లో ఆలోచించావా?
నీవు ఆమెను వృద్దాశ్రమం లో వదిలినట్టుగా నీ చిన్నప్పుడు ఆమె కూడా నిన్ను అనాథ శరణాలయం లో వదిలేసి ఉంటె నీ గతి ఏమయ్యేది ?”

" సర్ నాకు సెలవు కావాలి సర్!" సుధాకర్ అడిగాడు .
దేనికి?
"మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...