Skip to main content

నేటి మోటివేషన్... ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది.

ఈ పోస్ట్ లో మీఅందరి మనసులనీ భయపెట్టే , ప్రశ్నించే, కలవరపెట్టే కొన్ని తట్టుకోలేని నిజాలను మాట్లాడతాను.....!!!!!
  డిస్ట్రబ్ అవ్వకుండా చదవండి.....!!!!!

  ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది. ఇది మీలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.......!!!!!

ఇంటర్నెట్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని స్మార్ట్ ఫోన్ అద్దం నుంచి చూస్తున్న రోజులు ఇవి...!!!!!!

టెక్నాలజీ పెరిగిపోయి , మొబైల్ డేటా మిగిలిపోతుంటే దానిని ఎలా ఉపయోగించాలో తెలియక చిన్నపిల్లల నుంచి 
స్త్రీలు,
  ముసలివారి వరకూ అడ్డమైన పోర్న్ సైట్లూ, 
 సెక్స్ వీడియోలూ చూస్తూ 
తమ ఫ్రీ మొబైల్ డేటాను  
ఏరోజుకారోజు వాడేసుకోవాలనే 
తాపత్రయంలో తమకు తెలియకుండానే 
పోర్న్ సైట్లకు బానిసలౌతున్న రోజులు ఇవి....!!!!!!

తమ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో , బంధుమిత్రులతో కలిసిపోలేక 
  క్రొత్త పరిచయాల కోసం వెతుకులాడుతూ ఉన్నారో లేరో తెలియని వ్యక్తులతో, 
నమ్మాలో లేదో తెలీయని శక్తులతో 
 తమ ఆలోచనల్నీ ,
రహస్యాల్నీ పంచుకోవాలని సోషల్ మీడియాలో దేవులాడే రోజులు ఇవి....!     

తమపై ఉన్న చదువుల ఒత్తిడిని ,
 ర్యాంకుల పోటీనీ తట్టుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళే పిల్లలు కొందరైతే ,  

ఈ తెలిసీ తెలియని టీనేజ్ లో సినిమాలు టీవీలు స్నేహితులు ఇచ్చే ప్రోత్సాహంతో ఎంతమందిని లవ్ లోకి దింపితే అంత గ్రేట్ అనీ, ఎంత ఖర్చు పెడితే అంత గొప్పనీ, ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అంత అంత గ్లామరనీ, ఎన్ని వ్యసనాలు ఉంటే అంత హీరోయిజమనీ , 
ఎంతమందితో శృంగారం చేస్తే అంత ధ్రిల్ అనీ భ్రమ పడుతూ తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్న పిల్లలు కొంతమంది.....

కొన్ని సర్వేల ప్రకారం ఫ్రీమొబైల్ డేటాలకు అలవాటు పడ్డ ఇండియాలో పొర్న్ వీడియోలు చూసేవారి శాతం రోజుకి సగటున 68% ఉంది. వీరిలో మగవారు 21% అయితే పోర్న్ వెబ్సైట్లు, సెక్స్ వీడియోలు చూసే మహిళలు పిల్లల శాతం అక్షరాల 47% శాతం.

 దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. 
 ఇక్కడి పరిస్ధితి ఎలా ఉందో.   
మీరు అవసరానికి పనికొస్తాయని ఎంతో ప్రేమగా, ఎంతో నమ్మకంగా కొనిస్తున్న మొబైళ్ళు దేనికి ఉపయోగపడకపోయినా , దీనికి ఉపయోగపడుతున్నాయి. 

మా పిల్లలు చాలా మంచివాళ్ళు , 
చాలా పద్దతిగా పెంచుతున్నాం అనే డైలాగులు అందరూ చెప్తారు. 
కానీ నెట్ లో కనిపించే చెడునీ,
 అశ్లీలాన్ని దాటుకుని తమను తాము నియంత్రించుకుంటూ మంచినీ, జ్నానాన్నీ, విజ్నానాన్నీ వెతుక్కుంటూ కొత్త విషయాలు నేర్చుకుని తమను తాము గొప్పగా మలుచుకోగలిగిన నైపుణ్యం, 
నియంత్రణ మీ పిల్లలకీ,  
కుటుంబ సభ్యులకీ నిజంగానే ఉందంటారా ? 
మీకు తెలీకుండా వాళ్ళ మొబైల్స్ లో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలుసా ?
 అంత నమ్మకం మీకుంటే సరదాగా ఒక్క వారం రోజులు వాళ్ళ ఫేస్బుక్, వాట్సప్, స్కైప్, జీ మెయిల్స్ వంటివన్నీ యాక్టివేట్ చేసి వాళ్ళ మొబైల్స్ మీ దగ్గర ఉంచుకుని చూడండి కొన్ని కొత్త విషయాలు తెల్సుకుంటారు.....

 మీకు తెలుసా... 

మహిళల మీద రేప్ లు జరుగుతున్న దేశాలలో... సనాతన ధర్మాన్ని , సాంప్రదాయ విలువలనీ పాటిస్తామనీ గొప్పలు చెప్పుకునే మన వేదభూమి, మన పవిత్ర భారతదేశం 4 వ స్ధానంలో ఉంది.

 ఇక్కడ ప్రతీ 22 నిముషాలకీ ఒక స్త్రీ రేప్ కి గురౌతుంది. టాప్ టెన్ రేపిస్ట్ కంట్రీస్ లో మన ఇండియా ఒకటి. మహిళలపై రేప్ లు జరుగుతున్న దేశాలను గమనిస్తే వరుస స్ధానాలలో అమెరికా, దక్షిణ ఆఫ్రికా, స్వీడన్, భారత్, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంక, ఇథోపియా ఉన్నాయి . ఇందులో భారత్ విజయవంతంగా 4 వస్ధానం దక్కించుకుంది.

మన దేశంలో 60% రేప్ కేసులు పోలీసుల వరకూ , ప్రభుత్వ లెక్కల వరకూ వెళ్లవని మీకు తె్లిసిందే. ఎందుకంటే మన ఇండియాలో రేప్ లు చేసేది ఎక్కడో బయటి నుంచి వచ్చిన ముక్కూ మొహం తెలీనివారు కాదు. స్వంత కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్ధులే.

మీకు ఒక విషయం చెప్పనా... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2012లో భారత్‌లో 24, 923 రేప్ కేసులు నమోదయ్యాయి. 

ఈ కేసుల్లో 24,470 కేసుల్లో నేరస్తులు తండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారే అంటే మనమెంత వెధవలమో మనకే తెలియాలి. 

ఎదిగిన పిల్లల్నీ ఇంట్లో ఉంచుకుని కూడా వారి కళ్ళ ముందే డబుల్ మీనింగులు మాట్లాడుకుంటూ శృంగార చేష్టలు చేస్తూ అదే అన్యోన్య దాంపత్యంగా ఫీలయ్యే పేరెంట్స్, 
వయసొచ్చిన కొడుకునీ ,
కూతురునీ ఒకే గదిలోనో ,
ఒకేమంచం మీదో పడుకోబెట్టి 
తమగది తలుపులు మూసుకునే అమ్మానాన్నలు, 

 ఎదుగుతున్న కొడుకుల కళ్ళముందే కంఫర్ట్ కోసం అంటూ ,
మోడ్రన్ డ్రెస్ లు
  నైట్ డ్రెస్ ల పేరుతో రహస్య శరీరభాగాలను బహిర్గతం చేసి
  అంగాంగ ప్రదర్శన చేసే దుస్తులను కూతుళ్ళకు వేసి ఎంకరేజ్ చేస్తూ నట్టింట్లో తిప్పే మమ్మీడాడీలు, 

 ఆర్ధికస్ధితి సహకరించక చిన్నచిన్న ఇళ్ళలో జీవిస్తూ ఒకేగదిలో నివసిస్తూ బట్టలు మార్చుకుంటూ , 

 పిల్లలు నిద్రపోయారో లేదో చూసుకోకుండా కాపురం చేసేసే తల్లిదండ్రులు....!    

ప్రతీరోజూ పోర్న్ వెబ్సైట్లలో వేలాదిగా స్వంతఇళ్ళలో రికార్డు చేసిన స్పై వీడియోలు , ఇన్సెస్ట్ వీడియోలు అప్లోడ్ అవుతున్న ఈ సమయంలో మనమంతా చాలామారాలీ, 
చాలా జాగ్రత్త పడాలి....

' *శోచంతి జామయోయత్ర వినశ్వత్యాశు తత్కులం
నశోచంతితు యత్రైతా వర్ధతే తద్ధిసర్వదా '* అన్నారు పెద్దలు ,

ఏ ఇంట ఆడపడుచులు ఆదరించబడతారో ఆ వంశం సుసంపన్నంగా వర్ధిల్లుతుంది , 
ఏ ఇంట ఆడపడుచులు కన్నీళ్ళు పెడతారో ఆ వంశం నశిస్తుంది అని అంటారు. 

కౌరవ వంశం నాశనం కావాడానికి కారణం ధుర్యోధనుడి వ్యక్తిత్వం మాత్రమే కాదు, 
కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా పిల్లల మీద ఉన్న పిచ్చి పుత్రవాత్సల్యంతో వారిని కంట్రోల్ చేయలేని ధృతరాష్ట్రుడి మనస్తత్వం కూడా...!

 మీ విషయంలో అలా జరుగకుండా చూసుకోండి. మీ పిల్లలకు స్వేచ్చను ఇవ్వండి కానీ వారిని ఎప్పటికప్పుడు గమనిస్తుండండి. 

ఆడపిల్లలకు సభ్యత నేర్పండి , మగపిల్లలకు సంస్కారం నేర్పండి.  

ఆడపిల్లకు ఆత్మస్ధైర్యాన్నీ, మగపిల్లాడికి విచక్షణనీ, స్వీయనియంత్రణనీ నేర్పండి.    

 సంపాదన కోసం ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ ఉదయం బయటికి పోతే రాత్రికి ఇంటికి వచ్చే మీలో చాలామందికి పిల్లలతో గడపడానికి టైముండదు.
 వీరు వాళ్ళ మార్కుల్లో వచ్చే మార్పులు గమనిస్తారు కానీ వాళ్ళ మనసులో వచ్చే మార్పులు గమనించరు. మనలో తమ పిల్లలకు ఆస్తులు సంపాదించాలని చూసేవారే గానీ సంస్కారంగా పెంచాలని చూసే వారెంతమంది...? 

ఎవరెలాపోతే నీకెందుకు, నీ చదువు నువ్వు చదువుకుని మంచి ర్యాంకో, ఉద్యోగమో తెచ్చుకోమనీ, బాగా డబ్బు సంపాదించమనీ మాత్రమే కదా మనం మన పిల్లలకి చెప్తున్నాం.

 ఇంక వారికి విలువలు ఎక్కడ్నుంచి వస్తాయి...? 

ఇలాంటి తల్లిదండ్రుల వద్ద పెరిగిన పిల్లలు రేప్ లు , మోసాలు చేయక ఏం చేస్తారు..?

 ఫేస్బుక్/ whatsapp లో టైం పాస్ చేసి నాలాంటి వాడు పెట్టే మంచి పోస్టులని షేర్ చేయాలని చూపించే తాపత్రయంలో వందో వంతు మీకున్న మంచి ఆలోచనలను మీ పిల్లలతో షేర్ చేయాలని ఎప్పుడైనా చూసారా మీరు...? 

 ఒక వయసుకి వచ్చాకా పిల్లలకు నేర్పాల్సింది చదువు మాత్రమే కాదు సంస్కారం కూడా. ఎన్నివేల ఫీజులు కట్టినా అది కాన్వెంట్లలో కాలేజీలలో నేర్పరు. అది మీరే నేర్పుకోవాలి.అని ఓ యువకుడిగా ఆవేదన వ్యక్తం చేయుచున్నాను ............

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺