Skip to main content

లక్ష్య చేస్తున్న మరో మహా సమరం

దైవమా ఇది నీకు న్యాయమా...🙏

అందమైన బాల్యాన్ని చిదిమేశావ్..

లాలించే అమ్మని దూరం చేశావ్...

పాలించే నాన్నని కూడా నీ వద్దకే తీసుకుపోయాయ్...

ఒంటరితనాన్ని బహుమతిగా ఇచ్చావ్...

నా అన్న వాళ్ళని చుట్టూ చేరకుండా చేసి అతన్ని అష్ట దిగ్భంధనం చేశావ్....

అయినా సరిపోలేదా నీ ఆటకు...?

పదేళ్ల ప్రాయం నుండీ...
వెంటాడే ప్రతీ కష్టం...
వెనక్కి లాగుతున్నా..
దాతలసహాయంతో...చదువుకుంటూ...
ఇంటర్మీడియట్లో 90 శాతం మార్కులు తెచ్చుకుని డాక్టర్ కావాలనుకుని కలలు కనేవాడు....

సరిగ్గా అలాంటి వేళ...
రెండు కిడ్నీలను నాశనం చేసి...
కనికరం లేకుండా నీవాడిన ఆటలో...
రెక్కలు తెగిన విహంగంలా మారి మంచానికి పరిమితం అయ్యాడు...

దాతలు జాలి తలచి పెట్టే...
ఒక పూట భోజనాన్ని రెండు పూటలా సర్దుకుని తింటూ...
వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ...
నా అన్న వాళ్ళు తోడు లేక..
రోజులు లెక్కబెడుతున్నాడు....
చస్తూ బ్రతుకీడుస్తున్నాడు...

ఈయన కష్టాన్ని చూసి...
ఆ కష్టానికి కూడా కన్నీళ్లు వచ్చాయేమో..?జీవన్ దాన్ సంస్థ ద్వారా కిడ్నీ అందించేలా ఏర్పాటు చేసింది...

కానీ తొండి ఆట ఆడుతున్న ఆ దైవం ఈసారి మరలా ఆపరేషన్ కోసం అవసరం అయిన అతి పెద్ద భారాన్ని అతని ముందు ఉంచింది...

సమయం లేదు మిత్రమా...
కేవలం ఎనిమిది అంటే..
ఎనిమిదే రోజుల కాలం....
కావాల్సింది ఆరు లక్షల రూపాయలు...🙏
సహచర సంస్థలు చేస్తున్న ప్రయత్నాలతో మనం కూడా అడుగేద్దాం...

పోరాడదాం మిత్రమా....
ఒంటరితనం అతన్ని నుండి దూరంగా పారిపోయేదాకా....!
కష్టం అతన్ని వదిలి పరుగులు తీసేదాకా..!!

మన వల్ల ఏమి కాదులే అనుకోకు మిత్రమా....
వందల గడ్డి పోచలు పెనవేస్తే మదపుటేనుగుని కూడా బంధించగలవు....

ఇప్పటి వరకూ స్పందించిన దాతల వివరాలు...


ప్రాణాలు నిలపడానికి సాగుతున్న ఈ యజ్ఞంలో నేను సైతం అంటూ అడుగులు వేసే మానవ దైవాల కోసం ఎదురుచూస్తూ..🙏
■■■■■■■■■■■■■
పేరు: అనుమలపూడి గణేష్
సమస్య : శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి చేయడం
అంచనా వ్యయం: 6 లక్షలు
■■■■■■■■■■■■■
మీ గుండె చప్పుడు పంపవలసిన మా చిరునామా

🛡️ACCOUNT HOLDER NAME:
 LAKSHYA CHARITABLE SOCIETY
🛡️ACCOUNT NUMBER: 50200054999726
🛡️IFSC CODE: HDFC0003326
📲PHONE PAY/ GOOGLE PAY: 9848956595
■■■■■■■■■■■■■

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... పరిశీలన!

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...