ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా , కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో , తెలివిగా ఎదురుకోవాలి.....!!
ఒక చిన్న గ్రామంలో జరిగింది....!
ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు . అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను,వ్యాపారి అందమైన కుమర్తె మీద పడింది. అతనికి ,ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను ‘ అని చెప్పాడు. ఈ మాట విన్న వ్యాపారి మరియు అతని కుమారి ఆశ్చర్యపోయరు
అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు,’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి , ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు , అప్పుడు కూడా నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను ‘. అని చెప్పాడు.
ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తోటలోని రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి కూతురు, షావుకారు దుర్బుద్ధితో సంచీలో రెండూ నల్ల రాళ్ళనే వెయ్యటం చూసింది. ఆ అమ్మాయి స్థానంలో గనక ఉంటే తప్పించుకోటానికి మీరు ఏం చేసేవారు ? ఆ అమ్మాయికి ఏమి సలహా ఇచ్చేవారు ?
జాగ్రత్తగా ఆలోచిస్తే కింద వివరించబడ్డ మూడు అవకాశలు కనిపిస్తాయి.
1. ఆ అమ్మాయి సంచీలోనించి రాయి తీయడానికి ఒప్పుకోకూడదు.
2. సంచీలో రెండూ కూడా నలుపు రంగు రాళ్ళే ఉన్నాయని చూపించి, షావుకారు మోసగాడు అని నిరూపించాలి.
3. తప్పదు గనక సంచీలో నుండి నల్లని రాయినే తీసి,ఆ షావుకారిని పెళ్లి చేసుకుని తన తండ్రిని అప్పు నుంచి, జైలు నుంచి కాపాడాలి. ఈ విధంగా తండ్రిని కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి.
ఇంతకి ఈకథలోని అమ్మాయి ఏమిచేసిందంటే…
సంచీ లోనించి ఒక రాయిని తీసి, సరిగ్గా చూడకుండా, జారిపోయినట్టు నటించి , నేల మీద మిగతా రాళ్ళ మధ్యలో పడేసింది.
వ్యాపారి చేసిన మోసం గురించి తెలియనట్లు ,”పొరపాటు అయింది, క్షమించమని వ్యాపారిని కోరింది . సంచీలో ఏ రంగు రాయి మిగిలిందో చూస్తే, నేను ఇంకో రంగు రాయి తీసినట్టు తెలుస్తుంది కదా “అని అంది. సంచీలో నల్ల రాయి ఉంది కాబట్టి, అమ్మాయి తెల్ల రాయి తీసినట్టు అయింది. ఇది చూసిన షావుకారు తన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు. ఈ విధంగా కథలోని అమ్మాయి కష్టమైన సందర్భాన్ని కూడా, తెలివిగా తనకు అనుకువుగా మార్చుకుంది.
ఈ కథ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనా శక్తికి ,సాధారణమైన ఆలోచనా శక్తికి కల బేధాన్ని తెలియచేస్తుంది.
నీతి:
జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా, తెలివిగా ఎదురుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా ,కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో ,తెలివిగా ఎదురుకోవాలి.
Comments
Post a Comment