Skip to main content

నేటి మోటివేషన్ ఆడపిల్లని కన్న ప్రతి తండ్రికి అంకితం



ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు...

" చిన్న తల్లీ ... " నా చేయి గట్టిగా పట్టుకొని నడువు. అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు"...

అప్పుడు ఆ పాప ఇలా అంది.
"లేదు నాన్న... మీరే నాచేయి పట్టుకోండి." అపుడు ఆతండ్రి ఆశ్చర్యంగా ఆపాపని "నేను చెప్పింది కూడా అదే కదమ్మా! రెండింటికి తేడా ఏమిటి" అని అడిగాడు. అప్పుడు ఆపాప ఇలా చెప్పింది...

"చాలా తేడా ఉంది నాన్న"... నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు. కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణంగా అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు అని నమ్మకంగా తండ్రితో చెప్పింది...

వెంటనే ఆతండ్రి పాపని హత్తుకొని "నువ్వు నా బంగారు తల్లివిరా... " నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను" అని అన్నాడు...

అప్పుడు ఆ పాప ఆ విషయం నాకు తెలుసు... అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే... నువ్వు మాత్రం నన్ను నీగుండెలో పెట్టుకొని జీవితాంతం మోస్తావు. ఎందుకంటే నువు నాన్నవి నాన్న అన్నది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... పరిశీలన!

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...