దేవుడా నేను ఏం పాపం చేసానని నన్ను ఇలా పుట్టించావు
దేవుడా నన్ను ఎందుకు గుడ్డివాడిగా పుట్టించావు ఈ అందమైన ప్రకృతిని ఆరాధించలేని దురదృష్టవంతుడిని చేసావు
నాకు చేతులుంటే అతడికంటే బాగా బొమ్మలు వేసేవాడినేమో
రెండు చేతులు ఇచ్చావు కానీ అంత ఖరీదైన బ్రష్ పెయింట్ ఉంటె నేను గీసే బొమ్మ కూడా అంత అద్భుతంగా వచ్చేదేమో
నాకు కాళ్ళు ఉంటె నేను అతని కంటే వేగంగా పరిగెత్తేవాడినేమో
కాళ్ళు ఉన్నవాడు నాకు సైకిల్ ఉంటె అతడి కంటే వేగంగా వెళ్ళేవాడినేమో
సైకిల్ ఉన్న వాడేమో నాకు మోటార్ బైక్ ఉంటె అని
బైక్ ఉన్నవాడేమో నాకు కారు ఉంటె అని ఇలా మనిషెప్పుడూ మనకు ఉన్నదాంతో ఆనందపడడం మరిచిపోతున్నారు
ఇలా దేవుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడకుండా ఇంకా ఇంకా అంటూ వెళ్తే మాత్రం జీవితంలో మీకు అసంతృప్తి మిగిలి నిరాశ ఎక్కువవుతుంది
ఒకరోజు సైకిల్ పోటీ పెట్టారు అక్కడకు ఒక్క కాలు ఉన్న వ్యక్తి పాల్గొనడానికి వచ్చాడు
అక్కడ వచ్చిన వారు ఒక్కరు చాల దూరం సైకిల్ తొక్కాల్సి ఉంటుంది ఒక్క కాలు ఉన్న నీకు ఇది కష్టం నీకు పర్లేదా అని అడిగాడు
మీరు సైకిల్ తొక్కేప్పుడు మీకు రెండు కాళ్ళు నొప్పి పుడతాయి కానీ నాకు ఒక్క కాలే నొప్పి పెడుతుంది అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు
ఏదో ఇవ్వలేదని
మనకేదో దక్కలేదని బాధపడకండి
మన బలహీనతలను సైతం బలంగా మార్చుకున్నప్పుడే మనం ఎందులోనైనా విజయం సాధించగలం
Comments
Post a Comment