ఒక దేశాన్ని దోచుకునే బందిపోటు దొంగలు గుంపుగా వస్తున్నారు. కంటికి ఎదురుగా కనిపిస్తున్న అందరిని నరుకుతూ ముందుకు సాగుతున్నారు
ప్రజలంతా ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు.
వీధిలో ఒక మహిళ ఇద్దరు పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉన్నింది ఆ దొంగలను చూడగానే బిడ్డలిద్దరిని ఎత్తుకుని పరిగెత్తసాగింది
చాల దూరం ఇద్దరిని పట్టుకుని పరిగెత్తలేకపోవడంతో ఒక బిడ్డను దారిలో వదిలేసి ఒక బిడ్డతో సురక్షితంగా బయట పడింది
తాను దించేసిన బిడ్డను ఆ దొంగలు నరికేశారు
ఇదంతా గమనించిన ఒక పెద్దాయన తల్లికి ఇద్దరు బిడ్డలు సమానమే ఒక బిడ్డను అలా ఆ బిడ్డనే ఎలా వదిలేసావు అని అడిగాడు
అందుకు ఆ తల్లి వేదన నిండిన హృదయంతో ఇలా చెప్పింది సమాధానం
నా బిడ్డకు మా పొరుగింటి బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంటె ఇంతలో ఈ బందిపోట్లు వచ్చారు
ఇతరుల బిడ్డను అక్కడ వదిలేసే హక్కు నాకు లేదు అందుకే ఆ బిడ్డను కాపాడాలని నా బిడ్డను దించేసాను అని చెప్పింది
ఇది విన్న పెద్దయానకు కన్నీళ్లు ఆగలేదు
ఈ సంఘటన జపాన్లో జరిగిందంట అక్కడి మనుషుల మనస్తత్వాలు ఇతరుల పట్ల వారి మర్యాదను తెలిపే కథ ఈ తల్లి కథ అంటారు
Comments
Post a Comment