Skip to main content

చరిత్రలో ఈ రోజు జూన్ / - 11

🔎సంఘటనలు🔍

🌸1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.

🌸1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.

🌸1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.

🌸1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

🌸1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

🌸1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది

🌸1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనునుకొనుగోలు చేసింది.

🌸2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.

🌸2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలోప్రారంభమయ్యాయి.

🌼జననాలు🌼

💞1920: మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).

💞1924: అబు అబ్రహాం, ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (మ.2002)

💞1932: ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని (మ.2016).

💞1944: మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

💞1947: లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు.

💐మరణాలు💐

🍁1963: టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు

🍁1979: జాన్ వెయిన్, హాలీవుడ్ నటుడు (జ.1907).

🍁1983: ఘనశ్యాం దాస్ బిర్లా, భారత పారిశ్రామిక వేత్త. (జ.1894)

🍁1987: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (జ.1900)

🍁2001: ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ.
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺