Skip to main content

నేటి ఆరోగ్య సూత్ర.... మీరు పెరుగుతో పాటు ఈ ఫుడ్స్ కలిపి తింటున్నారా..



పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లతో పాటు ఇతర కీలక పోషకాలు ఉంటాయి. 

ప్రతిరోజు పెరుగు తింటే ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది.

ఇందులోని ప్రొబయోటిక్స్ కారణంగా పేగుల కదలికలు చురుగ్గా ఉంటాయి.

పెరుగు తింటే ఎనర్జీ లెవల్స్ పెరగడంతో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. 

ఇది సూపర్ ఫుడ్‌గా ఉండటమే కాకుండా బ్యూటీ ప్రొడక్టుగానూ పనిచేస్తుంది. 

స్కిన్, హెయిర్ హెల్త్‌కి పెరుగు బెనిఫిట్ చేస్తుంది.

అందుకే, పెరుగు ను తప్పనిసరిగా రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. 

అయితే, పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్స్

నూనెలో వేయించిన ఫుడ్స్‌తో పెరుగు ని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

 నూనె పదార్థాలు, పెరుగు కలిపి తింటే బాడీ పెయిన్స్, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

మామిడి

పెరుగు తో కలిపి మామిడి పండును తినకూడదు. 

మామిడి పండు శరీరానికి వేడి చేస్తుంది. పెరుగు తినేముందు, తిన్నాక  ఉల్లిపాయల్లాగే మామిడి పండుని కూడా అవాయిడ్ చేయాలి.

వడ

కొందరు చాలా ఇష్టంగా దహి వడ తింటుంటారు. 

కానీ, ఈ కాంబినేషన్ కొన్నిసార్లు జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. 

కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, కడుపు నిండుగా ఉండటం వంటి అసౌకర్యం కలుగుతుంది. 

కాబట్టి, పెరుగు, వడ కలిపి తినకూడదు.

పాలు

పాల నుంచే పెరుగు తయారైనప్పటికీ పాలు, పెరుగు కలిపి తినకూడదు.

 ఈ రెండింటిని కలిపి తింటే డయేరియా, వాంతులు, వికారం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

 కాబట్టి, ఈ రెండింటిని కలిపి అస్సలు తినకూడదు.

ఉల్లిపాయ

 పెరుగుతో మజ్జిగ, రైతా చేసుకుంటాం. 

వీటిలో ఆనియన్స్ కూడా వేస్తాం.

 అయితే, ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. 

ఇవి రెండింటిని కలిపి తింటే బాడీ హీట్ పెరిగి కూలింగ్ తగ్గుతుంది.

 దీంతో అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగు లో ఆనియన్స్ మిక్స్ చేసి తినకూడదు.

సిట్రస్ ఫ్రూట్స్

నిమ్మకాయ, నారింజ, బత్తాయి, సంత్ర వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ని కూడా పెరుగు తో కలిపి తినొద్దు. 

పెరుగు తినకముందు, తిన్న తర్వాత వీటి జోలికి వెళ్లకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

 వీటిని కలిపి తింటే కడుపులో చెడు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

చేపలు

ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు, చేపలు కలిపి తింటే శరీరం విషమయం అవుతుంది. 

పెరుగు తో పాటు చేపల్లో ప్రొటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 

బాడీకి తగినంత ప్రొటీన్ అవసరమే కానీ చేపలు, పెరుగు కలిపి తింటే బాడీలో అవసరానికి మించి ప్రొటీన్ పేరుకుపోతుంది.

 ఎక్సెస్ ప్రొటీన్ కారణంగా బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఎముకల వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. 

కాబట్టి, పెరుగు, చేపలను కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Credits:👉🏽అమ్మ సేవా సమితి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.

 ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.

మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.

సాధ్యమయినంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమడీస్ పై ఆధార పడవద్దు. చిట్కాలు , హోమ్ రెమడీస్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺