Skip to main content

యూనివర్స్ కి సంబందించిన 50 ముఖ్యమైన ప్రశ్నలు..


1. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. శనిగ్రహం

2. ఏ గ్రహాన్ని God of Agriculture గా పేర్కొంటారు?
A. శనిగ్రహం

3. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది?
A. శనిగ్రహం

4. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది?
A. శనిగ్రహం

5. Orange Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. శనిగ్రహం

6. అందమైన వలయాలు గ్రహం ఏది?
A. శనిగ్రహం

7. Golden Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. శనిగ్రహం

8. శనిగ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని?"
A. 82 ఉపగ్రహాలు (ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29)

9. Green Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. యురేనస్

10. God of the Sky అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. యురేనస్

11. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. యురేనస్

12. యురేనస్ కు గల ఉపగ్రహాలు ఎన్ని?
A. 27 (మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి)

13. నిర్మాణుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. నెప్ట్యూన్

14. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం?
A. నెప్ట్యూన్

15. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది?
A. నెప్ట్యూన్

16. నెప్ట్యూన్ కి గల ఉపగ్రహాలు ఎన్ని?
A. 14 ఉపగ్రహాలు

17. అంతర గ్రహాలు అని వేటిని అంటారు?
A. సూర్యునికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలు (1. బుధుడు 2. శుక్రుడు 3. భూమి 4. అంగారకుడు)

18. బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు?
A. సూర్యునికి దూరంగా ఉన్న నాలుగు గ్రహాలను (1. బృహస్పతి 2. శని 3. యురేనస్ 4. నెప్ట్యూన్)

19. ఉల్కలు అని వేటిని అంటారు?
A. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను

20. గ్రహశకలాలు అని వేటిని అంటారు?
A. అంగారకుడు, బృహస్పతిల మధ్యగల గ్రహ శిథిలాలను

21. జియోయిడ్ ఆకారంలో ఉండే గ్రహం ఏది?
A. భూమి

22. ప్రతీ 76 సం.లకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్క ఏది?
A. హేలీ తోకచుక్క

23. గ్రహాలలో రాజు అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. గురుడు

24. షూటింగ్ స్టార్స్ అని వేటిని అంటారు?
A. ఉల్కలను

25. భూమికి గల చలనాలు ఏవి?
A. 1. భూ భ్రమణం 2. భూ పరిభ్రమణం

26. భూమి యొక్క ఏ చలనం వలన రాత్రి పగళ్ళు ఏర్పడతాయి?
A. భూ భ్రమణం వలన

27. భూమి యొక్క ఏ చలనం వలన ఋతువులు ఏర్పడతాయి?
A. భూ పరిభ్రమణం

28. భూ భ్రమణం అంటే ఏమిటి?
A. భూమి తన చుట్టూ తాను తిరగడం

29. భూ పరిభ్రమణం అంటే ఏమిటి
A. భూమి సూర్యుని చుట్టూ తిరగడం

30. గ్లోబు మీద భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు?
A. అక్షాంశాలు

31. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసనట్లు ఉండే రేఖలను ఏమంటారు?
A. రేఖాంశాలు

32. ఏ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు?
A. 0° రేఖాంశాన్ని

33. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్థభాగాన్ని ఏమంటారు?
A. ఉత్తరార్ధగోళం

34. భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్థభాగాన్ని ఏమంటారు?
A. దక్షిణార్థ గోళం

35. గ్రీనిచ్ (0°) రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్థగోళాన్ని ఏమంటారు?
A. తూర్పు అర్థగోళం

36. గ్రీనిచ్ (0°) రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్థగోళాన్ని ఏమంటారు?
A. పశ్చిమ అర్థగోళం

37. ఏ అక్షాంశాన్ని ఉత్తర ధృవం అంటారు?
A. 90° ఉత్తర అక్షాంశాన్ని

38. ఏ అక్షాంశాన్ని దక్షిణ ధృవం అంటారు?
A. 90° దక్షిణ అక్షాంశాన్ని

39. ఏ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు?
A. 66½° ఉత్తర అక్షాంశాన్ని

40. ఏ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు?
A. 66½ దక్షిణ అక్షాంశాన్ని

41. ఏ అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు?
A. 23½° ఉత్తర అక్షాంశాన్ని

42. ఏ అక్షాంశాన్ని మకరరేఖ అంటారు?
A. 23½° దక్షిణ అక్షాంశాన్ని

43. ఏ రేఖాంశాన్ని “అంతర్జాతీయ దినరేఖ” అంటారు?
A. 180° తూర్పు & పశ్చిమ రేఖాంశాన్ని

44. మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు?
A. రేఖాంశాలను

*m45. అక్షాంశాలు ఏ దిశలలో ఉంటాయి?
A. తూర్పు మరియు పశ్చిమ దిశలలో

46. రేఖాంశాలు ఏ దిశలలో ఉంటాయి?
A. ఉత్తరం మరియు దక్షిణ దిశలలో

47. ఏ తేదీలలో భూమి అంతటా రాత్రి, పగళ్ళు సమానంగా ఉంటాయి?
A. మార్చి 21 మరియు సెప్టెంబరు 23 (విషవత్తులు)

48. ఏ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద పడతాయి?
A. డిసంబర్ 22న

49. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు?
A. మార్టిన్ బెహైమ్ (1492)

50. ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు?
A. టకి అల్ దిన్ (1570)

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺