Skip to main content

తెలుసుకుందాం... రోజుకో కొత్త విషయం...


🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది?

✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది.

బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది. ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పరికరాలు మత్తు పానీయం స్థాయిని అంకెల్లో చూసిస్తే, మరో కొన్ని రంగులు మార్పు ద్వారా చూపిస్తాయి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺