సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నించి చూడు గెలవకపోయినా ప్రయత్నం చేయకుండానే ఓడిపోయాను అన్న ఫీలింగ్ నీకు ఉండదు ..
ఈ ప్రపంచంలో ఎంత విచిత్రమైనది అంటే అన్నీ ఉన్నవాడికి చేయాలన్న జ్ఞానం ఉండదు. అవయవాలు సరిగా లేకపోయినా వాళ్ళు ఏంటో నిరూపించుకోవాలి ప్రపంచంలో విజేతలుగా నిలబడాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని మనం బ్లెస్స్ చేయాలి అభినందించాలి ..
నేను అనాటమీ న్యూరో క్లాసెస్ నేర్చుకుంటున్నాను అనాటమీ న్యూరో అంటే మన బ్రెయిన్ ద్వారా మన ఆలోచనలని ఎలా నియంత్రించవచ్చు ఎలా డైవర్ట్ చేయొచ్చు అదే క్లాస్ ..
మన ఆలోచనలు మారడం వల్ల సగం సమస్యలు పోతాయి అంటే మన ఆలోచనలని మనం నియంత్రించడం ద్వారా మానసిక శరీరకమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం మందులు కూడా లొంగనీ ఎన్నో జబ్బులకి మెడిసన్ దొరుకుతుంది..
మా క్లాసులో ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి హైట్ చాలా అంటే చాలా తక్కువ అండ్ ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల టోటల్గా
బెడ్ మీద లేచి నడవలేదు చేతులు కూడా సహకరిస్తాయో లేదో తెలీదు కానీ ఆ అమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో గొప్ప మౌత్ పెయింటర్ గా నిలబడింది ..
తనను చూస్తే చాలా చిన్న పిల్ల లాగా ఉంటుంది కానీ అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన నుండి అన్ని అవయవాలు కరెక్ట్ గా ఉన్నాం మనం చేయలేని పని పూర్తిగా ఫ్రెండ్ కి అంకితం అయిపోయిన అమ్మాయి తన నోటితో ఎన్నో చిత్రాలను గీసి గిన్నిస్ బుక్ లో రికార్డ్స్ తీసుకోంది..
ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కాళ్లు చేతులు అన్నీ కూడా ఉండే సోమరిలాగా తిరిగే మనుషులను చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ప్రయత్నం చేసిన తర్వాత ఓడిపోతే ఒక సంతృప్తి ఉంటుంది ఏ ప్రయత్నం చేయకుండా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఓటమినీ అంగీకరించే వాళ్ళు ఈ ప్రపంచంలో మనుషుల కింద లెక్కలోకి రారు ..
నీ చుట్టూ ఉన్న సమస్యలను నువ్వే పరిష్కరించకపోతే ఇంకెవరు పరిష్కరిస్తారు నీ పని నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అనవసరంగా కాలయాపన చేస్తూ మరొకరికి ప్రాబ్లం గా బ్రతికే దానికన్నా మనకి చేతనైతే మనం చేస్తూ ముందుకు వెళ్తే ఆ లైఫ్ ఏ వేరు ఆ తృప్తి వేరు ..
ఓడిపోయిన కూడా ఆగిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండు నీ ప్రయత్నం ఏదో ఒకరోజు తప్పకుండా ఫలిస్తుంది విజయం నిన్ను వరిస్తుంది కష్టే ఫలే అన్నారు పెద్దవాళ్ళు..
Comments
Post a Comment