Skip to main content

నేటి మోటివేషన్... మెదడుని ప్రశాంతంగా ఉంచడం


ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా చాలా మంది పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. రాత్రి చాలా సేపు దానితోనే గడుపుతూ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయమే ఆలస్యంగా మేల్కొనడం, లేవగానే ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి సాధారణమైపోయాయి. దీని కారణంగా మన మెదడు మొద్దుబారిపోతోందని... ఆలోచనా శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ పొద్దునే కొన్ని రకాల అలవాట్లను చేసుకుంటే... మెదడు చురుకుగా మారుతుందని వివరిస్తున్నారు.

రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రలేవడం
ఎవరైనా సరే రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలోని జీవగడియారం (సర్కాడియం రిథమ్) సరిగా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.

యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ చేయండి
ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో శరీరంలో ఒత్తిడి తగ్గి, అప్రమత్తత పెరుగుతుందని వివరిస్తున్నారు. దీనితో రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

మీ ఆలోచనలు, లక్ష్యాలను రాసుకోవడం...
రోజూ ఉదయం నిద్రలేచిన కొంతసేపటి తర్వాత ఆ రోజుకు సంబంధించి మీరు చేయాల్సిన పనులు, ఆలోచనలు, లక్ష్యాలను రాసిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీలో ఒత్తిడిని తగ్గించి, సమస్యలను పరిష్కరించుకోగల శక్తిని పెంచుతుందని... కొత్త ఆలోచనలను కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఉదయమే ఫ్రెష్ గా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఏదైనా చదవడం... ప్రాక్టీస్ చేయడం...
ఉదయమే ఏదైనా చదవడం, నేర్చుకోవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి మెదడు షార్ప్ అవడానికి తోడ్పడతాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మెదడులో కొత్త సమాచారం స్టోర్ అవడం, సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా ఉత్సాహంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

సరైన పోషకాహారం తీసుకోవడం...
ఉదయమే శరీరానికి, మెదడుకు తగిన శక్తిని అందించగల సరైన పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకుంటే... రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఉదయమే కాసేపు ఎండలో గడపండి
రోజూ ఉదయమే కాసేపు ఎండలో గడిపితే.. శరీరంలో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయపు ఎండలో యోగా, వ్యాయామం, ధ్యానం వంటి చేయవచ్చని... దీనివల్ల రెండు రకాలుగానూ లాభం ఉంటుందని వివరిస్తున్నారు.

పరగడుపునే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగండి
రాత్రంతా చమట, శ్వాస ద్వారా నీరు వెళ్లిపోయి... ఉదయమే శరీరంలో కాస్త డీహైడ్రేషన్ పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉదయమే కాలకృత్యాలు తీర్చుకున్నాక పరగడుపునే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. దీనితో శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు బయటికిపోయి శుభ్రం అవుతుందని.. మెదడుకు చురుకుదానాన్ని ఇస్తుందని చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.

వ్యాయామం తప్పనిసరిగా చేయండి
రోజూ ఉదయమే తప్పనిసరిగా కొంతసేపు వ్యాయామం చేయండి. వేగంగా నడవడం (బ్రిస్క్ వాక్), లేదా చిన్నపాటి వ్యాయామాలు చేసినా... శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగిన స్థాయిలో అందుతుంది. అంతేగాకుండా వ్యాయామం వల్ల శరీరంలో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ విడుదల అవుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, నేర్చుకునే శక్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...