ఒక ముసలి జంట, ఎప్పుడు చూసినా చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉండటం చూస్తే, ప్రేమకు అర్థంలా మాత్రమే కాదు, జీవితాన్ని చాలా ఆందంగా చేయి తిరిగిన చేనేతకారుడు అల్లిన గొప్ప వస్త్రంలా అనిపిస్తారు.
ఎన్నో రాత్రులు వారు బాగా దెబ్బలాడుకుని నిద్రపోయి, ఉదయం మళ్లీ ఒకరిని ఒకరు హత్తుకున్నారు కదా అని ఆలోచిస్తాను.
ఎన్నో వాదనలు, గొడవలు వారిని విడదీసేందుకు సిద్ధంగా ఉండగా, వారి ప్రేమ మళ్లీ మళ్లీ వారిని కలిపింది కదా? అని ఆలోచిస్తాను
ఎన్నో అపార్థాలను వారు అధిగమించి, తాత్కాలికంగా కలిగిన బాధ కన్నా, వారి బంధం విలువైనదని అర్థం చేసుకున్నారు కదా? అని ఆలోచిస్తాను
ప్రేమ అంటే ఒక కథ కాదు, సంబంధాలు కేవలం భావోద్వేగాలపై ఆధారపడి ఉండవు.
నిజమైన ప్రేమ అనేది, కఠినమైన సమయాల్లో, మనవారికోసం తీసుకునే ఒక నిర్ణయం. ఒకరి లోపాలను ఒకరు అంగీకరించడం, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ బలంగా ప్రేమించటం.
పరస్పరం క్షమించుకోవడం, కలిసి ఎదగడం, ప్రతి ప్రేమకథకూ పరీక్షలు ఉంటాయనే నిజాన్ని అర్థం చేసుకోవడం.
ఆ ముసలి జంట? వారు ఎప్పుడూ పడచువాళ్ళే అనిపిస్తారు. అప్పట్లో వారు కూడా గాఢమైన ప్రేమలో మునిగిపోయి, కొత్త జీవితం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు.
వారు తప్పులు చేశారు. ఒకరినొకరు భాధ పెట్టుకున్నారు. సందేహాలు, అనిశ్చితి ముసురుకున్న క్షణాలు కూడా చాలా ఉండే ఉంటాయి.
కానీ ఎంతగా కష్టాలు వచ్చినా, వారు ఎప్పుడూ ఒకరినొకరు వదులుకోలేదు.
ప్రేమ అంటే గొడవలు లేకపోవడం కాదు, ఒకరినొకరు విడిచిపెట్టకుండా పోరాడడమే అసలు సిసలు ప్రేమ.
ఒక గొడవ తర్వాత, మళ్లీ స్నేహంగా చేతిని పట్టుకున్న ఆ నిశ్శబ్ద క్షణాల్లో ప్రేమ ఉంటుంది.
కష్టసమయాల్లో చూపే సహనం ప్రేమను నిజమైనదిగా మారుస్తుంది. ప్రేమ అనేది ఒక భావోద్వేగం మాత్రమే కాదు – అది ఒక హామీ, ఒక జీవన వాగ్దానం.
ఎంతకాలం ఒక జంట కలిసి జీవిస్తారో మీకు అర్థం కావాలంటే, సమాధానం స్పష్టం:
కష్టకాలాల్లో కూడా ప్రేమను ఎంచుకున్నవారు,
అనేక సార్లు ఒకరినొకరు క్షమించుకున్నవారిని
తాత్కాలికంగా వచ్చే తుపానులు ఏవీ దెబ్బతీయలేవు.
మీ జీవితయాత్రను అందమైనదిగా మార్చే వ్యక్తిని కనుక్కోవడమే నిజమైన ప్రేమ!
Comments
Post a Comment