1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి
🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,
🌿ఎలా చెయ్యాలి
🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు.
2. They folllow a morning ritual -
వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -
🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,
🌿ధ్యానం చెయ్యడం,
🌿మంచి పుస్తకాలు చదవడం.
👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు.
3. They spend 15 minutes each day on focused thinking -
🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..
🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి..
🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..
🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..
🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..
🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -
అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు.
4. They spend time with people who inspire them -
🌿వాళ్ళ సమయం అంతా వాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహించే వాళ్ళ మధ్యే ఎక్కువ గడుపుతారు.
🌿తక్కువ లేదా లోకువ చేసే వాళ్ళకి, ఊరికే సోది కబుర్లతో సమయం వృధా చేసే వాళ్ళకి తమ జీవితంలో అసలు చోటు ఇవ్వరు.
5. They think always positive -
🌿వీరంతా ఎలాంటి పరిస్థితిలో అయినా సరైన ఆశావహ దృక్పధంతోనే ఉంటారు.
🌿ఎప్పుడు ఒక చెడు ఆలోచన వచ్చినా దానిని వీరు అప్పటికప్పుడే సక్రమమైన ఆలోచనగా మార్చేసుకుంటారు.
🌿ఏ పరిస్థితులునయినా ధైర్యంగా ఎదుర్కొని నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.
6. They get enough sleep -
ఎంత పని ఉన్నా తప్పకుండా 5-6 గంటలు నిద్రపోతారు.
7. They read a lot -
🌿వీరు ఎప్పుడు సమయం దొరికినా టీవీ ముందు కాలక్షేపం చేయకుండా ఒక మంచి పుస్తకం చదవటానికి కేటాయిస్తారు.
🌿ఎక్కువ పుస్తకాలు కొంటారు..చదువుతారు.. తమ పిల్లలకి కూడా ఈ అలవాటు చిన్నప్పటి నుండి నేర్పుతారు.
🌿కచ్చితంగా వాళ్ళ ఇంటిలో ఒక చిన్న గ్రంధాలయం ఏర్పరచుకుంటారు.
8. Social Service -
🌿లక్ష్యాలు అంటే అవి కేవలం డబ్బు సంపాదించడానికే అయ్యి వుండవు.
🌿వాళ్ళ కలలు నిజం చేయడం కోసం అహర్నిశం కష్టపడతారు.
🌿డబ్బు చేదు..డబ్బు మంచిది కాదు..లోకమంతా తమని డబ్బు పిచ్చి వాళ్ళు అనుకుంటారు అని అస్సలు నెగటివ్ గా ఆలోచించరు.
🌿ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ మందికి సహాయపడవచ్చు..
🌿ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు.
🌿మంచి జీవితం గడపవచ్చు.
🌿అమ్మ నాన్న కలలు కోరికలు నిజం చేయవచ్చు.
😁విజయం సాధించిన వారిలో చాలా మంది వాళ్ళ ఆస్థిలో చాలా శాతం సమాజ అభివృద్ధి కోసం కేటాయిస్తారు.
🌿చరిత్రలో తమ పేరు నిలుపుకుంటారు.
9.They give more importance to family -
🌿ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తమ కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు.
🌿రోజూ కుటుంబ సభ్యులతో కూర్చొని మనస్ఫూర్తిగా అన్ని విషయాలు చర్చించుకుంటారు.
🌿సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా విహారయాత్రలు లేదా ఆధ్యాత్మిక యాత్రలకి కుటుంబ సమేతంగా వెళ్ళి సంతోషంగా గడుపుతారు.
10. They maintain a journal -
🌿రాత్రి నిద్రించే ముందు ఆరోజు ఎలా గడిచింది, ఏ పనులు పూర్తి అయ్యాయి.
🌿ఏవి మిగిలి ఉన్నాయి...ధ్యానం, యోగ, వ్యాయామం, పుస్తకాల చదవడానికి, ఇతర ముఖ్యమైన పనులకి ఎంత సమయం కేటాయించారో వివరంగా రాసుకుంటారు.
🌿తర్వాత రోజు చేయాల్సిన పనుల ప్రణాళిక అంతా ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకుంటారు.🍁
Comments
Post a Comment