అమ్మ చేతివంట తినాలనిపిస్తోందా! మరైతే ఇది చదివి వెళ్ళండి మరి.
తన భర్తకు ఇష్టమైన చేపలపులుసు చేసి భర్త మెప్పు పొందాలని అతనికోసం ఎదురుచూస్తోంది కమల.చేపలపులుసు వాసన అదిరిపోతోంది...
తన భర్త రాగానే సంతోషంగా వడ్డించింది...చేపలపులుసు తింటూ ఇలా అన్నాడు.
" మా అమ్మ చేపలపులుసు చేస్తే ఊరంతా వాసన వస్తుంది..చేపలపులుసు చేస్తే అమ్మనే చేయాలి..సూపర్ గా ఉంటుంది తెలుసా!ఏమైనా కానీ మా అమ్మ వంట తరువాతే ఎవరి వంట అయినా"
ఇలా వాళ్ళమ్మ వంటను పొగుడుతున్నాడు భర్త...
నేను చేసిన పులుసు బాగుందని చెప్తాడు అనుకుంటే వాళ్ళమ్మను పొగుడుతున్నాడు...ఈయన గారికే అమ్మ ఉన్నట్టు" అంటూ సణిగింది కమల.
ఇంతలో తన కొడుకు స్కూల్ నుండి రాగానే ...
" అమ్మా!చేపలపులుసు చేసావా? వీధి చివరిదాకా వాసన వస్తోంది తొందరగా పెట్టు" అంటూ చేతులు కడుక్కొని వచ్చాడు.. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే"
అమ్మ! నువ్వు చేసినట్లు పులుసు ఎవరు చేసినా బాగోదు...అమృతం లా ఉందమ్మా! ఇంకాస్త వడ్డించు...కడుపునిండా పులుసే తినేస్తాను. నువ్వు సూపర్ అమ్మా!నీవంట ఇంకా సూపర్" అన్నాడు.
అమ్మ కళ్ళల్లో కన్నీరు...నా భర్త అమ్మను తలచుకుంటే గొణుక్కున్నాను.నా కొడుకు నన్ను మెచ్చుకుంటే సంతోషపడ్డాను.ప్రతి ఒక్కరికి అమ్మ వంటకు మించిన రుచి మరొకటి ఉండదు కదా!తన తప్పు తెలుసుకుంది కమల.
అర్థం చేసుకునే భార్య ఉంటే ఆమెకూడా ఒక అమ్మే తన భర్త కు....నిజమే కదా 👩👧👧👩👧👧👩👧👧👩👧👧👩👧👧👩👧👧
👌👌👌👌👌👌
ReplyDelete