🌸జవాబు: మనిషి జ్ఞానానికి, దంతానికి అసలు సంబంధమే లేదు. మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. కింది, పై దవడల్లో కుడి వైపు 8, ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి. ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్లు, ఒక కోరపన్ను(canine tooth), 2 అగ్రచర్వణ కాలు(premolars), 3 చర్వణకాలు(Molars) ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా లోపల ఉండే మూడవ చర్వణకాన్ని (3rd molar) జ్ఞాన దంతమని పిలుస్తారు.
👉 ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లుతో ఉండేది.. కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి, లోపలి చర్వణకానికి స్థానం ఇరుకైంది. ఈ దంతం సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వస్తుంది. ఇరుకు దవడలో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగుతుంది.
👉 అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యలో మార్పువచ్చి అసలు జ్ఞానదంతాలే ఏర్పడకపోవచ్చునన్నది ఓ ఊహ. బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది, ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.
నాకు ఈ మధ్య
ReplyDelete2 సైడ్స్ వచ్చాయి..
But righ side teath పిప్పి పన్ను అయింది డాక్టర్ నీ కాన్సూల్ట్ అయితే తీసేయలి అన్నారు..
తీపిచను.. పెయిన్ టార్చర్..
భరించేలేక తీయించేసా..
తీసేస్తే ఎం అయినా side ఎఫెక్ట్స్ వస్తాయా