Skip to main content

నేటి మోటివేషన్... పిల్లలకు ఈ ఎమోషనల్ డ్రామాలు ఆపి కాస్త మానసికంగా గట్టిగా తయారయ్యే పద్దతి ఆలోచించాలి మనం


హాస్పిటల్ లో మామూలుగా మధ్యాహ్నం 2:30 కి ఓపీ కట్టేసి ఇంటికి వెళ్లి అన్నం తిని కాసేపు కునుకు తీసే సమయం..

సీసీ కెమరాలో ముగ్గురు పిల్లలు ఓపిలోకి రావడం చూసాను..వాళ్ళ వయసు ఒక 7-8 సంవత్సరాలు ఉండచ్చు...తల్లి తండ్రులు ఏమన్నా వస్తున్నారేమో అని చూసా..ఎవ్వరూ లేరు..కాసేపటికి ఒక ఆయన వచ్చాడు..టీచర్ అనుకుంటా
వచ్చి గమ్మున వైటింగ్ హాల్లో కూర్చున్నాడు...

ఆ ముగ్గురు పిల్లలలో ఒక్కడు వచ్చి రిసెప్షన్ లో ఓపీ చిటీ తీస్కోవడం గమనించా...ఒక పిల్లాడు సైలెంట్ గా ఉన్నాడు..వాడి మోచేతికి గుడ్డ కట్టి ఉంది..

నా టేబుల్‌ మీద ఉన్న బెల్ కొట్టి
పిల్లలని లోపలకి పంపమని చెప్పా.. నలిగిన బట్టలతో ముగ్గురూ కలిసి లోపలకి వచ్చారు...దెబ్బ తగిలిన కుర్రాడు వచ్చి దైర్యంగా స్టూల్ మీద కూర్చున్నాడు...వాడి కంటిలో ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు …నేను చేతిని గమనించి కాస్త ముట్టుకుని పరీక్ష చేసే సమయంలో కాస్త నొప్పి అని చెప్పాడు...వెంటనే వాడి పక్కన ఉన్న ఇద్దరూ వాడి బుజం మీద చెయ్యి వేసి ..ఏమి కాదులేరా..మేము ఉన్నాం కదా అని వాడితో చెప్పారు... 

సరే అని నేను X రే స్లిప్ రాసి ఇచ్చాను..

ఒక 5 నిమిషాల్లో X రే రిపోర్ట్ వచ్చింది ..మోచెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది..

టీచర్ ని పిలిచి చెప్పాను..చేతిని రెడీ చేసి పిండి కట్టు వేయాల్సి ఉంటుంది అని... *టీచర్ కన్నా ముందు ఆ ఇద్దరు పిల్లలు జవాబు చెప్పారు...సరే సార్ కట్టేయండి..అని..* 

కాసేపటికి మా స్టాఫ్ కట్టు రెడీ చేసి పిలిచారు ..నేను లోపలకి వెళ్ళా.వాడిని అడిగా ఏరా కట్టేయమంటావా అని.. *రండి సార్ కట్టేయండి అని..జవాబు ఇచ్చాడు.. కాస్త విరిగిన ఎముకను లాగి సరి చేసి పిండి కట్టు కట్టే సమయం లో కూడా వాడు చిన్న అరుపు కూడా అరవలేదు* 

...వాడిని మామూలుగా అందరూ అడిగే ప్రశ్నే అడిగాను.. పెద్దయ్యాక ఏమవుతావురా అని...?? 
ఏమో తెలీదు సార్ అన్నాడు...

మరి పెద్ద అయ్యాక డబ్బులు కావాలి కదరా అన్నాను... బ్రతకాలంటే కావాలి కదా సార్ అన్నాడు...

ముగ్గురు ఒకరిని ఒకరు పట్టుకొని లోపలికి ఎలా వచ్చారో...అలానే కలిసి వెళ్ళిపోయారు..నవ్వుకుటూ..

సో నేను ఇప్పుడు ఎందుకు ఈ సోది మొత్తం చెప్తున్నాను అంటే...

(1) ఈ మొత్తం కథ లో పిల్లాడు ఎక్కడ అమ్మ నాన్న అని ఏడవలేదు..

(2) వాడి మానసిక దైర్యం పీక్స్ లో ఉంది కనుకనే, ఎముక విరిగినా కూడా వాడు నొప్పి అని ఏడవలేదు..

(3) వాడితో కలిసి వచ్చిన పిల్లలు ముచ్చటగా ఉన్నారు.. వీడికి దైర్యం చెప్తూ..ఓదారుస్తూ..

*8-9 సంవత్సరాల వయసులోనే ముగ్గురు పిల్లలు మానసికంగా గట్టిగా ఉన్నారు..ఎవరి మీద ఆధారపడకుండా...* 

(4) పెద్ద అయ్యాక ఏమవతావురా అంటే.. ఏమో సార్ తెలీదు అన్నాడు..అంటే వాడు ఈరోజుని ఎంజాయ్ చేస్తున్నాడు, రేపటి గురించి టెన్షన్ పడకుండా..

ఇప్పుడు ఈ మొత్తం సీన్ ఇదే ప్రొబ్లంతో ప్రైవేటు స్కూల్ పిల్లాడు & బాగా చదువుకున్న పేరెంట్స్ తో వస్తే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం..

బోరుమని ఏడుస్తున్న అదే వయసున్న పిల్లాడు అమ్మ ఒళ్ళో కూర్చొంటాడు... కనీసం వాడ్ని.... వాడి చేతిని తాకనివ్వరు....తల్లి కూడా వాడితో పాటూ ఏడుస్తూ ఇంక ముద్దులన్ని వాడికి ఈరోజే పెట్టేయాలన్నట్లు వాడి బుగ్గలు కొరికి పెడుతూ ఉంటుంది...

బయట చూస్తే నాన్న ఏమో, వీడిని వదిలేసి స్కూల్ యాజమాన్యంతో గొడవ వేసుకుంటూ, హాస్పిటల్ అంతా వినపడేలా ఫోనులో అరుస్తూ ఉంటాడు...

ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరు కడతారు.. నా పిల్లాడు చేతికి గ్యారంటీ ఎవరు ఇస్తారు అని.. మా పిల్లాడికి ఏమన్నా అయితే మిమ్మల్ని వదిలి పెట్టను అని..

ఆ గొడవ సర్ధుమనిగాక లోపలకి వచ్చి ఒక 100 క్వశ్చన్ లు వేస్తాడు ఒక్కేసారి...

చెప్పండీ Dr ఎంటి ప్రాబ్లం?
మీరు చెయ్యగలుగుతారా లేదా??
బెంగళూర్ కి తీసుకెళ్ళాలా??
మా పిల్లాడు చేతికి గ్యారంటీ ఇస్తారా??

నా నోట్లో నుంచి ఒక్క మాటే వస్తుంది.. X ray తీస్కొని రండి చూద్దాము అని...

ఆ X రే వచ్చే లోపు ఒక పదిమంది చుట్టాలకీ, ఫ్రెండ్స్ కి ఫోను చేసి వారిని హాస్పిటల్ కు రప్పిస్తాడు.. ఓ ఇద్దరు తెలిసిన వారితో నాకూ ఫోను చేయిస్తాడు..

నేను ఆ X ray తీసి చూసే లోపు దాన్ని నాతోపాటు ఒక పది మంది చూస్తూ ఉంటారు..

ఇంక నేను ఇలా ఫ్రాక్చర్ ఉంది అని అనిఅనగానే ...అయ్యో ఫ్రాక్చర్ అహ్...లేక క్రాకా అంటారు..

మీరు గారంటీ ఇస్తే చెయ్యండి లేదంటే లేదు అంటారు ఓ పెద్ద మనిషి.. కాస్త ఓపిక కూడగట్టుకొని ..పిండి కట్టుకి రాసిస్తా…

అంత మంది వచ్చినా కూడా ఎవరూ ఆ పిండి కట్టు కట్టేదానికి డబ్బులు మాత్రం బయటకు తియ్యరు...

కట్టు కట్టాలని వెళ్తే వాడు అమ్మ ఒళ్ళో నుంచి ఇంకా కిందకి దిగుండడు...బయట కూర్చోండి అని వాళ్ళకి చెప్తే ..అయ్యయ్యో చిన పిల్లాడు అని స్టార్ట్ చేస్తారు..

నానా తిప్పలు పడి..
వాడిని లాలించి..
బుజ్జగించి..బతిమాలి.. కాడ్బెరీ ఆశపెట్టి.. ఎలానో కట్టు కట్టేసి నా రూంకి వచ్చి కూర్చుంట..

పిల్లలకు ఈ ఎమోషనల్ డ్రామాలు ఆపి కాస్త మానసికంగా గట్టిగా తయారయ్యే పద్దతి ఆలోచించాలి మనం

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups