నువ్వు అనుకున్నవి సాధించాలా? చాలాచోట్ల పాజిటివ్ అఫర్మేషన్స్ తరచూ చెప్పుకోమని చెబుతుంటారు. అంటే ఇలా..
"నేను కష్టపడి అనుకున్నది సాధిస్తాను, నాకు అన్నీ అనుకూలిస్తాయి, నేను మంచి పొజిషన్లో ఉంటాను" ఇలా రిపీటెడ్‌గా ఓ జపంలా అనుకోవడం ద్వారా కొంతకాలానికి అది సబ్-కాన్షియస్ మైండ్‌లోకి చేరుకుని, మన మైండ్ మనకు కావలసిన స్థితిని సాధించేలా మనకు సహకరించి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది దీంట్లో మెయిన్ సూత్రం. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
కానీ ఇందులో అందరూ చేసే తప్పు ఒకటి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఉన్న ఎమోషన్ స్థాయిలోనే ఉంటూ నువ్వు నీ లక్ష్యాలను సాకారం చేసుకోలేవు. అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు నువ్వు "నేను ఏదీ సాధించలేకపోయాను, నా లైఫ్ ఇలా తగలడిపోయింది" అని నిరుత్సాహంగా ఉన్న స్థితిలో, నువ్వు కొన్ని కోట్ల సార్లు "నేను అన్నీ సాధిస్తాను" అని చెప్పుకున్నా కొద్దిగా కూడా మారవు.
నీ కలలు సాకారం కావాలంటే.. నువ్వు చెప్పుకునే "నేను అన్నీ సాధిస్తాను, నేను మంచి పొజిషన్లో ఉంటాను" అనే అఫర్మేషన్స్‌తో పాటు అవి చెప్పుకునేటప్పుడు నువ్వు అన్నీ సాధించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో దాన్ని ఇప్పుడు అంతే ఇంటెన్సిటీతో ఫీల్ అవుతూ ఉండాలి. నువ్వు నీరసమైన మానసిక స్థితిలో ఉంటే నీ ఆలోచనలు ఇప్పుడున్న నీరసమైన మానసిక స్థితినే నీ ముందు ఫలితంగా నిలుపుతాయి.
దీనికి చాలా ఊహాశక్తి కావాలి. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది... నేను అన్నీ సాధిస్తాను అని వెర్బల్‌గా అనుకున్న క్షణంలోనే అన్నీ సాధించినప్పుడు మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్లు, మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ పూర్తి ఫీలింగ్‌లోకి ఇమాజినేషన్‌లోకి వెళ్లాలి. ఎంత తరచూ ఈ అనుభూతికి లోను కాగలిగితే అంత ఈజీగా మీ శరీరం, మీ మైండ్ మీ లక్ష్యాల కోసం ట్యూన్ అవుతుంది, అవి సాధించగలుగుతారు. అంతే గానీ, నీరసంగా కూర్చుని "నేనన్నీ సాధిస్తాను" అని ఓ మాట అనుకుంటే, ఆ క్షణమే మీ ఇన్నర్ టాక్ "నీ బొంద నీ వల్లేం అవుతుంది" అని మరో యాంగిల్ నుండి దెప్పిపొడుస్తుంది. థాట్, ఎమోషన్ మ్యాచ్ అయినప్పుడు మనం కోరుకున్న దిశగా ఫలితాలు వస్తాయి.
Comments
Post a Comment