Skip to main content

తెలుసు కుందాం

అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?
చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి. 

వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... పరిశీలన!

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...