Skip to main content

తెలుసుకుందాం

🎻గిటార్ పై కన్నమెందుకు❓
🌸జవాబు: గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో (Tensoin) తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ForcedVibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది . 

👉 అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(SoundBoxes) పై బిగిస్తారు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ పెరిగితే ఏమి చేయాలి

ప్రధానోపాధ్యాయులకు/ప్రధానాచార్యులకు తెలియజేయునది. 10వ తరగతి పాసైన కొంతమంది విద్యార్థులకు IIIT అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వారి మార్కులు మారి పెరగడం జరిగింది Already అప్లై చేసిన విద్యార్థులకు మరలా తిరిగి అప్లై చేసే అవకాశం లేదు కావున అట్లాంటి విద్యార్థుల కోసం కన్వీనర్ IIIT వారికి అడ్రస్ చేస్తూ గతంలో అప్లై చేసిన అప్లికేషన్ నంబర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ ను రాస్తూ మార్కులు పెరిగిన తర్వాత కొత్తగా వచ్చిన మార్కులు మెమోని ఈ రిక్వెస్ట్ లెటర్ తో పాటు అటాచ్ చేసి ఈ క్రింది తెలిపిన రెండు Mail id లకు Convener Admissions RGUKT-AP •   convener.admissions@rgukt.in Assistant Registrar, Academics - RGUKT Nuzvid •   ar.academics@rguktn.ac.in  మెయిల్ చేసినట్లయితే పెరిగిన మార్కులను పరిగణలోకి తీసుకొని IIIT అవకాశం వచ్చే విధంగా కన్వీనర్ గారు చర్యలు తీసుకుంటారు. కావున ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ/ప్రధానాచార్య మిత్రులు గమనించవలసిందిగా కోరుతున్నాం. IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ లో పెరిగితే...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం...

🟥తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా? 🟢ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺