Skip to main content

నేటి మోటివేషన్... మనుషులంటే ఇంతే..

అదో పల్లెటూరు..

హైద్రాబాద్‌లోనో, విదేశాల్లోనే, వేరే రాష్ట్రాల్లోనే చాలా ఏళ్ల క్రితం సెటిల్ అయిన ఆ ఊరి వాస్తవ్యుడు దగ్గర పట్నంలో రైల్వేస్టేషన్‌కి అర్థరాత్రి ఏ చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో వచ్చి, స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకున్న బంధువు స్కూటర్ మీద ఇంటికి చేరుకుంటాడు.

పొద్దున్నే టిఫిన్ చేసి, అల్మారాలో ఉన్న నాన్న అడ్డ లుంగీ కట్టుకుని, నాలుగు వీధుల అవతల ఉన్న ఊరి సెంటర్‌కి స్నేహితుల్ని కలవడానికి బయల్దేరతాడు. ఒక్కో ఇల్లు దాటుకుంటూ వెళ్లే కొద్దీ వరుసకి పిన్నో, బాబాయో, అత్తయ్యో, మామయ్యో, తమ్ముడో, అక్కనో.. ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఆ మూల మీద పాతబడిపోయిన ఓ పెంకుటింటి వసారా క్రింద కూర్చున్న ఓ ముసలి తాత.. 'ఏరా అబ్బాయి.. ఇదేనా రావడం, ఇప్పుడు ఏ ఊళ్లో ఉంటున్నావు, ఎంతొస్తుందేంటి' అంటూ ఆరా తీయగానే ఆగి నవ్వుతూ, "ఆ, కంప్యూటర్ పనిలే, బానే వస్తుంది" అని సమాధానమిచ్చి ముందుకు కదులుతాడు. మరో పెరట్లో గోడ మీద బట్టలు ఆరేస్తూ.. ఓ పిన్ని "ఈ ఏడన్నా పప్పన్నం పెడుతున్నావారా.. మీ అమ్మకి తొరగా ఓ కోడలిని చూడు, తెగ కష్టపడిపోతోంది.." అంటూ మొహమింత చేసుకుని పలకరిస్తుంది. మనోడు సిగ్గుపడుతూ.. అప్పుడేనా పిన్నీ, కాస్త మంచిగా సెటిల్ కానీయ్.. అంటాడు.

మరో గుమ్మం అరుగు మీద బావ వరుసకి అయ్యే మరో ఆయన మీసాలు మెలేసుకుంటూ కూర్చుని ఉంటాడు. "ఏం బావా.. రోజురోజుకీ సోకులు ఎక్కువవుతున్నాయి, అక్కకి చెప్పమంటావా ఏంటి" అంటూ పరాచికాలాడుతూ ఉంటాడు ఈ కుర్రాడు. "ఆ చెప్పురా చెప్పు, నీకూ, మీ అక్కకీ భయపడడానికే ఇక్కడుంది" అంటూ తన ధైర్యాన్ని చూపిస్తాడు ఆ బావ.

ఇలా ప్రతీ గుమ్మం దగ్గరా ఎవరో ఒకరి పలకరింపులు.. మన కోసం నలుగురు మనుషులు ఉన్నారనే నమ్మకం. వాళ్ల లోపల వంద కుళ్లులు ఉండనీయి.. కనీసం నోరు తెరిచి.. ఏరా అబ్బాయ్.. అనే ఓ స్వంత వ్యక్తిగా own చేసుకునే మాట వింటే హృదయం పులకించిపోతుంది. ఏమైపోయాయి.. ఆ పలకరింపులు!

ఇప్పుడే బయట నుండి వస్తూ మా క్రింద ఫ్లాట్‌లో పిల్లలు ఆడుకుంటుంటే.. ఓ ఐదేళ్ల పిల్లాడిని వరుసగా నెంబర్లు అడిగి అప్పజెప్పించుకున్నాను.. అంతలో దూరం నుండి వాళ్ల నాయనమ్మ, తాతయ్య మురిపెంగా చూసుకుంటూ .. "ఏం సార్.. మా మనవడు ఏమంటున్నాడు" అని అడిగారు కళ్లంతా వెలిగిపోతుంటే! "మీ వాడు చాలా తెలివైన వాడు" అని నేనంటే, వాళ్ల సంతోషం మాటల్లో చెప్పలేనిది. మనుషులంటే ఇంతే.. అనుబంధాలతో పెనవేసుకుపోయే జీవితాలు!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...