Skip to main content

తెలుసుకుందాం...

🍒 భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి?

🍒తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.

🍒సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.

🍒రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.

🍒భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.

🍒కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే..12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺