Skip to main content

నేటి మోటివేషన్... మా నాన్న మోసగాడు


తండ్రి తన బిడ్డల కోసం పడే కష్టాలు చెప్పి కన్నీళ్లు పెట్టించాడు..
ఈ స్పీచ్ అధ్భుతం భయ్యా..!!

మా నాన్న మోసగాడు 

మా నాన్న ఎంతటి మోసగాడు అంటే ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటాడు.. 
భోజనం చేసేటప్పుడు ఆకలిగా లేదంటాడు.. ఇందాకే తిన్నానూ అంటూ నా కడుపు నిండా తినిపిస్తాడు. ఉద్యోగం చెయ్యక పోయినా - చేస్తున్నానని అంటాడు.. ఆఫీసుకి వెలుతున్నట్లుగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని, బయటకి వెళ్ళగానే - మురికి బట్టలు వేసుకొని, బయట ప్రతీ చిన్న చిన్న మురికి పనులూ రాత్రీ పగలూ అని తెలీకుండా చేస్తుంటాడు. నాకు మాత్రం మరకలు లేని, మడత పడనీ బట్టలే వేసుకోవడానికి ఇస్తుంటాడు. తనకి స్థోమత లేకున్నా నన్ను మంచి స్కూల్లో చేర్పించాడు.. స్కూల్ ఫీజులు ఎప్పుడూ చివాట్లు తింటూనే ఆలస్యంగా కట్టేస్తుంటాడు.. 

అమ్మ నేను పుట్టగానే చనిపోయిందంట. అమ్మేదీ అని అడిగితే అప్పుడూ అబద్ధమే చెబుతాడు - అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందీ అనీ.. ఆ దేవుడి వద్ద ఉన్న బోలెడన్ని చాక్లెట్స్, కేకులూ, బిస్కెట్స్ ని నాకోసం తేవడానికి వెళ్ళిందనీ, వాటితో తిరిగి వస్తుందనీ.. అమ్మ వచ్చేదాకా నేను ఎదురుచూసేలా - అంతగా నాలో ఆశని రేపేట్టాడు. కానీ, ఇంతవరకూ అమ్మ రాలేదు.. నాకేవీ తేలేదు.. మా నాన్న పచ్చి మోసగాడు కదూ.. 

ప్రతిరోజూ నాన్న ఒడిలో నిద్ర పోవాలని అనుకుంటాను.. ప్రొద్దున నుండీ ఒళ్ళంతా పులిసిపోయి ఉన్నా, నొప్పిగా ఉన్నా, తన శరీరాన్ని పరుపులా పరిచి, తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. మధ్యలో కరెంట్ పోతే, ఎక్కడ నాకు ఇబ్బందిగా ఉంటుందో అని విసనకర్రతో వీస్తూనే ఉంటాడు.. 

పుట్టుకతో వచ్చిన నా గుండె లోపాన్ని- ఆపరేషన్ ద్వారా సరిచేయించటానికి బోలెడంత డబ్బు కావాలి. దానికి చాలా డబ్బులు కావాలని డాక్టర్ అంటుండగా విన్నాను. కానీ నాన్న మాత్రం నాతో - మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనీ, వాటితో నీకు బాగు చేయిస్తా, నీకు ఏమీ కాదనీ.. అంటుంటాడు.. అప్పుడూ అబద్దమే చెబుతాడు.. నాకు తెలుసు - నాన్న దగ్గర డబ్బులు లేవనీ.. కానీ, నాకు ఆపరేషన్ చేయించాడు. చేయించేదాకా తెలీదు.. ఎలా డబ్బులు తెచ్చి, చేయించాడో. ఎన్నిసార్లు అడిగినా చిన్న చిరునవ్వే.. " నీకెందుకురా.. నీవు బాగుంటే చాలురా.." అని ముద్దెడుతాడు. నేను బ్రతికాను.. ఆ తరవాత తెలిసింది - నా ఆపరేషన్ కోసం తన కిడ్నీ ఒకటి అమ్మేసి, వచ్చిన డబ్బులతో నా ఆపరేషన్ చేయించాడనీ.. చాలా డబ్బులున్నాయని చెప్పి, ఇలా చెయ్యడం మోసం కాదా ?? 

మా నాన్నకి నేనంటే ప్రేమ కాదు.. పిచ్చి. ఎప్పుడూ తనకోసం బ్రతకలేదు.. నాకోసమే, నా సంతోషం లోనే బ్రతికాడు. ఎవరేదైనా తినడానికి ఇస్తే, సగం దాచుకొని, అది నాకోసం తెస్తాడు. సంతోషాలన్నీ పూర్తిగా నాకే ఇచ్చేశాడు.. బాధలూ, కష్టాలన్నీ తనే మోస్తున్నాడు. తినడం లో సగం పంచిన నాకూ ఆ కష్టాల్లో సగం పంచొచ్చు కదా.. కానీ అవన్నీ నాకే కావాలంటాడు. ఎంత మోసగాడు కదూ.. 

ఇన్ని అబద్ధాలాడి నన్ను మోసం చేస్తాడా? ఒక్కటిమాత్రమే నిజం ఎప్పుడూ చెబుతాడు.. నేను నవ్వితే మా అమ్మలా ఉంటానంట. నేను నవ్వితే తనకి ఎంతో సంతోషముగా ఉంటుందంట. నా నవ్వులో - దేవుడి వద్దకి వెళ్ళిన అమ్మ ఆ నవ్వులో తనని పలకరించినట్లు అనిపిస్తుందంట. అందుకే నేను తనకి నవ్వుతూ కనిపిస్తుంటాను..

Note :
అమ్మానాన్నలు మనకోసం ఎంతో
 త్యాగం చేస్తారు
 వృద్దాప్యంలో కంటికి రెప్పలా 
 మీ తల్లితండ్రులని బాగా చుసుకొండి

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...