Skip to main content

తెలుసుకుందాం...

🧾జనవరి నెల ఎలా వచ్చింది❓
🌸జవాబు: నెలల పేర్లు చెప్పమంటే... జనవరితోనే మొదలు పెడతాం కాని ఒకప్పుడు ఈ నెల లేనేలేదు.

👉 జనవరి మొదటి తేదీ రాగానే కొత్త ఏడాది వేడుకలను చేసుకుంటున్నాం. కానీ నెలలు ఏర్పడిన తర్వాత చాలా ఏళ్ల వరకు జనవరి అనే నెలే లేదు. జనవరి లేకపోతే మరి కొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభమయ్యేది? మార్చి 1న ఆ రోజునే ప్రపంచమంతా కొత్త ఏడాదిని స్వాగతించేది. మరి జనవరి నెల ఎలా వచ్చింది? ఎవరు ప్రవేశపెట్టారు.?

👉 ఇప్పుడు మనం వాడుతున్న 12 నెలల క్యాలండర్‌ని గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అంటారు. దీనికి ముందు అనేక రకాల క్యాలెండర్లు ఉండేవి. వాటిల్లో ముఖ్యమైనది రోమన్‌ క్యాలెండర్‌. ఇందులో 10 నెలలే ఉండేవి. జనవరి, ఫిబ్రవరి ఉండేవి కావు. మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. క్రీస్తు పూర్వం 700 శతాబ్దంలో రోమ్‌ను 'నుమా పాంటిలియస్‌' అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడే ఏడాదిని 12 నెలలుగా విభజించి, జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపాడు. దాంతో కొత్త ఏడాది ప్రారంభమయ్యే తేది జనవరి 1గా మారింది. మొదటి నెలకి ఏ పేరు పెట్టాలో ఆలోచించి నుమా చక్రవర్తి 'జానస్‌' అనే రోమన్‌ దేవుడి పేరు మీద 'జానారిస్‌' అని పెట్టాడు. వాడుక భాషలో అది జనవరిగా మారింది. అయితే నుమా జనవరికి 30 రోజుల్నే కేటాయించాడు. క్రీ.పూ. 46వ శతాబ్దంలో రోమ్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ మరో రోజును కలిపి 31 రోజుల నెలగా జనవరిని మార్చాడు. తరువాత 15వ శతాబ్దంలో ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగారియన్‌ క్యాలెండర్‌ రూపొందింది. ఇది కూడా జనవరిని మొదటినెలగానే కొనసాగించింది.

👉 ఇంతకీ జనవరికి 'జానస్‌' దేవుడి పేరునే ఎందుకు పెట్టాలి? మనకి వినాయకుడు ఎలాగో రోమన్లకు జానస్‌ అలాగ. ఏదైనా పని ప్రారంభించే ముందు వాళ్లు జానస్‌కు మొక్కేవారు. ఈ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం గతాన్ని, మరొకటి భవిష్యత్తును సూచిస్తుందని చెబుతారు. ఆరంభానికి, అంతానికి కూడా ఈయనే మూలమని నమ్ముతారు. ఓసారి రోమ్‌ను స్థాపించిన 'రోమ్యులస్‌' చక్రవర్తిని, అతని పరివారాన్ని పొరుగు రాజ్యపురాణి సబైన్‌ ఎత్తుకుపోతుంది. అప్పుడు జానస్‌ దేవుడు వారిపై అగ్నిపర్వతంలోని లావాను వెదజల్లి కాపాడాడనేది కథ.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...