🛖గుహలు ఎలా ఏర్పడతాయి❓
🌸జవాబు: కొండ గుహలు అధిక శాతం భూగర్భజలాల కదలికవల్ల ఏర్పడినవే. భూమి మీదపడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. ఆ ప్రయత్నంలో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రం చేసి దానిగుండా ప్రయాణిస్తూ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పరుస్తాయి.
👉 గాలిలో ఉండే కార్బన్ డై ఆక్షైడ్ వలన నీరు ఆమ్లగుణం సంతరిందుకుని రాతిని తినేస్తుంది. క్రమంగా రాయి కరిగిపోయి పగుళ్లుగా తయారవుతుంది, ఆ పగుళ్లను నీరు మరింత విశాలం చేసుకుంటూ పోతాయి. ఫలితంగా ఒక గుహ ఏర్పడుతుంది. కొండలపై పడ్డ వాన నీరు ఈవిధంగా గుహలు ఏర్పడడానికి కారణమవుతుంది.
👉 ప్రపంచంలో ఎన్నో గుహలు ఉన్నాయి. అతి పెద్ద గుహ 530 కి.మీ. పొడవుతో అమెరికాలో ఉన్నది. మన తెలుగు రాష్ట్రంలో అజెంతా-ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి.
Comments
Post a Comment