Skip to main content

తెలుసుకుందాం

📌గుచ్చుకున్న వాటితో సెప్టిక్ అవుతుందేం❓

🌸జవాబు: పాత ఇనుప వస్తువులే కాదు.. చాలా కాలం నేలమీద, మురికి ప్రదేశాల్లో ఉన్న ముల్లు గుచ్చుకున్నా, పాత కర్రముక్కలు గుచ్చుకున్నా కూడా సెప్టిక్‌ అవుతుంది. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, చెక్క ముక్క సందుల్లో, ముళ్లపొదల మూలల్లో నీటి ఆవిరి, దుమ్ము పేరుకుంటాయి. వీటి మీద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరుచుకుని వేలాదిగా పెరిగిపోయి ఉంటాయి. ఆయా వస్తువులు మన శరీరానికి గుచ్చుకున్నప్పుడు ఆ గాయం ద్వారా సూక్ష్మజీవులు మన రక్తంలో కలుస్తాయి. రక్తంలో పోషక విలువలు కలిగిన జీవకణాలు ఆహారంగా లభించడంతో సూక్ష్మజీవుల వృద్ధి మరింతగా పెరుగుతుంది. అందువల్ల పుండు(Septic) అవుతుంది.

👉 నిజానికి చెత్త కుండీల్లో ఉన్న కాగితాలు, మురికి రోడ్డు మీది మట్టికణాలు రక్తాన్ని చేరుకున్నా ఇలాగే సెప్టిక్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే.. అవి గుచ్చుకోవు కాబట్టి ప్రమాదం ఉండదు. పాతబడిన మురికి పరికరాలు ఏవి గుచ్చుకున్నా వైద్యుని సంప్రదించి టెట్నస్‌ టీకా తీసుకోవడం మంచిది. టెటనస్ క్రిములవలన ధనుర్వాతము అనే జబ్బు వచ్చే ప్రమాదము ఉంటుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...