Skip to main content

నేటి మోటివేషన్... ప్రతి కల్చర్ లో ఎన్నో అద్భుతమైన సంగతులు తెలుస్తాయి. మనల్ని మరింతగా మానవత్వం లోనికి నడిపిస్తాయి.🙏


ఒకరోజు మేము M.Sc స్టూడెంట్స్ తో కలిసి ఫీల్డ్ వర్క్ లో భాగం గా వైజాగ్ బీచ్ కి వెళ్ళాము. నాతో పాటుగా ఇద్దరు సర్స్ మరియు ఒక స్కాలర్.

మేము వెళ్లిన పని అయిపోయింది.... స్టూడెంట్స్ అంత ఒక దగ్గర కూర్చొని గుసగుసలు, వాళ్ళకి నచ్చినవి కొందరు కొనుక్కొని తింటున్నారు... స్వతహాగా మనుషులను ఒబ్సెర్వె చేసే గుణమున్న నేను ఒక సంభాషణ ను గమనిస్తున్న... ఆంధ్ర యూనివర్సిటీ లో చాలా మంది విదేశాల నుండి వచ్చి చదువుకుంటారు, అదే విధంగా మా డిపార్ట్మెంట్ కు ఒక వ్యక్తి మాస్టర్స్ చదవడానికి ఆఫ్రికా దేశం నుండి వచ్చాడు వాళ్లల మాతృభాష ఫ్రెంచ్ .
  
ఒకమ్మాయి బీచ్ రోడ్ లో బెలూన్ కొనుక్కోని ఆడుతుంది... ఇంతలో ఆ అమ్మాయి దగ్గరికి ఒక చిన్న పాపా వచ్చి ఎదో అడుగుతుంది. తెలుగులో అడిగింది కనుక ఆ అబ్బాయికి అర్థం కాక మామ్ ఆ పాపా ఏముంటుంది అని అడిగాడు... ఆ పాపకి ఇలాంటి 🎈 బెలూన్ కావాలి ... ఎక్కడ వున్నాయి అని అడుగుతుంది అని చెప్పాను. ఒక్కసారిగా కాస్త దూరం గా అటు ఇటు చూసాడు... ఎక్కడ బెలూన్ అమ్మే వాళ్ళు కనుచూపు మేర కనపడలేదు... అపుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకి వెళ్ళాడు... ఈ బెలూన్ ఎంత ? అని అడిగాడు... ఆ అమ్మాయి 100 రూపాయిలు అని చెప్పింది.

ఇంతలో ఆ అబ్బాయి తన జేబులో నుండి ఒక 100 రూపాయిలు బయటకు తీసి ఆ డబ్బులు నేను ఇస్తాను ఆ చంటి పిల్లకు బెలూన్ ఇవ్వమని చెప్తున్నాడు... ఆ సంభాషణ విన్న నేను చుట్టూతా చూస్తే ఆ పాపా వాళ్ల డాడీ తో ఎక్కడో దూరం గా వాకింగ్ చేసుకుంటూ వెల్పోతుంది.

నేను అపుడు వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్లి.. ఎందుకు బెలూన్ ఇవ్వమంటున్నావ్ ? ఆ అమ్మాయి కొనుకుంది కదా... అని అడిగి... తన సమాధానం కోసం చూస్తున్నా...

మామ్, ఆ చంటి పాపకు బెలూన్ కావాలి.. కానీ ఇక్కడ అది దొరక లేదు. వాళ్ళ నాన్న మొహంలో కూతురికి కొని పెట్టలేకపోయానే అని ఫీలింగ్ నేను చూసాను... "మీ దేశం నాకు కొత్త, పరిస్థితులు ఇంకా తెలీదు... కానీ మా దేశంలో ఒక సంప్రదాయం ఉంది అది ఏంటంటే... ఎవరి పిల్లలు అయిన వాళ్ళు అందరికి సమానమే, అంటే మేము మా కన్న పిల్లల్ని చూసినట్టే పరాయి పిల్లల్ని చూస్తాము... ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న మనం రేపు ఎక్కడ వుంటామో తెలీదు, ఏ పంచన ప్రాణాలు పోతాయో తెలీదు... సో మాకు ఇహ పర బేధం లేదు "అన్నాడు!.

ఒక్కసారిగా నాలో నుండి ఎదో వదిలి వెల్పోతున్న ఫీలింగ్ కల్గింది. 

ఆఫ్రికా వాళ్ళు నల్ల జాతీయులు,వెనకబడిన వాళ్ళు, కల్చర్ తెలీదు, ఇలా రాక రకాల మాటలు వింటాము మనం... కానీ అతని మాటలను బట్టి వాళ్ళు ఎంత విశాలం గా ఆలోచించారా ? ఆలోచిస్తారా ?? మనం ఎక్కడ ఉన్నాం? మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి అని నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను.

అప్పుడు అనిపించింది ప్రతి మనిషి లోనూ ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి... అని మన ఆలోచనలు, భావాలు విశాలం గా ఉంచి నేర్చుకోవాలే గాని ప్రతి కల్చర్ లో ఎన్నో అద్భుతమైన సంగతులు తెలుస్తాయి. మనల్ని మరింతగా మానవత్వం లోనికి నడిపిస్తాయి.🙏


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.  బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.  పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.  మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...