హీరో సల్మాన్‌ఖాన్ చక్కగా పెయింటింగ్స్ వేస్తాడు. సైఫ్ అలీ ఖాన్ గిటార్ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్లలో పాల్గొంటాడు. రతన్ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్ బచ్చన్ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్ ఫోన్ మూగబోతుంది. బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు. పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు. మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...
Comments
Post a Comment