🔋సోలార్ బేటరీ ఎలా పనిచేస్తుంది.❓
🌸జవాబు: సౌరశక్తిని విద్యుచ్చక్తిగా మార్చడమే సౌర ఘటాల(Solar Bataries) పని.
🌺 ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనం కోసం వాడతామనే విషయాన్ని బట్టి అవి పనిచేసే విధానమూ మారుతుంది.
🌺 కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి.
🌺 కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవసరమయ్యే కాలిక్యులేటర్లు, డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానంలో పనిచేస్తాయి.
🌺 చీకటిలో ఇవి పని చేయవు. ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు, యంత్రాలు, టార్చిలైట్లు, వీధి లైట్లు పనిచేయాలంటే తొలుత కాంతిశక్తిని చాలా గంటల పాటు విద్యుత్ శక్తిగా మారుస్తూ నిల్వ ఉంచుకునే విధానాని వాడతారు.
🌺 సిలికాన్ వంటి పదార్థాలలోని ఎలక్ట్రాన్లు కాంతిశక్తి వల్ల ఉత్తేజితమై ఒక శక్తిస్థాయి నుంచి పై శక్తిస్థాయికి మారుతూ ధన, రుణ విద్యుత్దావేశాల్ని ఏర్పరచ గలవు.
🌺 ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పొటెన్షియల్'' ఏర్పడుతుంది.
Comments
Post a Comment