Skip to main content

నేటి మోటివేషన్... డిప్రెషన్

తనెంత strong మైండ్ ఉన్న మనిషి ఆమె అలా ఆత్మహత్య చేసుకుందా 
అయ్యో అతను చాలా పెద్ద ఆఫీసర్ అతనెందుకు సూసైడ్ నోట్ రాసారు 
ఆ అమ్మాయి అందరితో నవ్వుతు ఉంటుందే తను ఆత్మహత్య చేసుకుందా 

ఇలా ఆత్మహత్య చేసుకున్నాక మాట్లాడతారు కానీ అంతకు ముందు డిప్రెషన్ లో ఉన్నప్పుడు పట్టించుకోరే 

అయినా డిప్రెషన్ ఎందుకు వస్తుంది మీకు 
ఎవరో వచ్చి మనల్ని గైడ్ చేయాలా ?
వాళ్ళు వచ్చి ఆదరిస్తే మన మనసు తేలికపడుతుందా ?
వాళ్ళ ఓదార్పు నీలో ఆశ నింపుతుందా ?
అంటే దాన్ని డిప్రెషన్ అనే కంటే ఒక రకమైన డిపెండెన్సీ అనాలి 
అది ఎప్పుడూ చులకనగా చేస్తుంది మనల్ని 

జీవితంలో ప్రతిదీ చాలా చిన్న విషయం అది గెలుపైనా ఓటమైనా 
అన్ని తాత్కాలికమే మనతో సహా 
బాధైనా సంతోషమైనా 
మనం ఇక్కడే ఉండిపోవాలన్న ఆ దేవుడు ఉండనివ్వడు 
ఈమాత్రానికి డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకోవాలా 

ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని బాధపడుతూ కూర్చోకుండా దగ్గర ఉన్న వ్యక్తిని ప్రేమించలేరా ?
ఓడిపోయామని ఇక ఎప్పటికి గెలవలేమని ఒకేచోట ఉండిపోవడం కంటే ఆ ఓటమి కి కారణాలు వెతకలేరా 

ఒక ఉద్యోగి నచ్చిన ఉద్యోగం దొరకలేదని అక్కడే ఆగిపోయాడు 
దొరికిన ఉద్యోగాన్ని నచ్చినట్టు మార్చుకోలేడా 

ఒక ఉపాధ్యాయుడు ఎంత కష్టపడ్డా ప్రమోషన్లేవు... చాలా బాధపడిపోతున్నాడు 
ఏ కష్టం లేకుండానే మరో ఉద్యోగి ప్రమోషన్ లు కొట్టేస్తున్నాడు...!

బహుశా అతడికి జీతం పెరిగిందేమో అంతే పిల్లలతో అనుబంధం పెరగలేదు...!

అతను ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నాక సత్కారాలతో పంపారు అక్కడితో ఆగిపోయింది...!

కానీ కష్టపడిన ఉపాధ్యాయుడు పిల్లల హృదయాల్లో నిలిచిపోయాడు 
100 మంది పిల్లలు తమ విజయానికి కారణం ఈ ఉపాధ్యాయుడే అని చెప్తూ గుర్తుపెట్టుకుని మరి వచ్చి ప్రతి ఏడాది పలకరిస్తూనే ఉన్నారు...!

ఆయన్ను సత్కరిస్తూనే ఉన్నారు 

అయన కోరుకున్న విషయంలో ఓడిపోయాడేమో కానీ అందరిని గెలిపించి అక్కడ అయన గెలిచాడు 
అలా మనం గెలవలేమా 
గెలుపంటే అర్థం ఇదే కదా 

నేనూ అనే ఒక్కడు గెలవడమా మన చుట్టూ ఉన్న అందరిని గెలిపించడమా గొప్ప ?

ఒకరు వచ్చి మనకు ధైర్యం చెప్పే అంత స్థితిలో లేము అని అనుకోవాలి 
ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధ పడుతుంటే బాధ అనిపించింది కారణం తెలిసి నిజంగా నవ్వొచ్చింది 

ఎంత పెద్ద నిజాయితీగల ఒక ఆఫీసర్ ప్రభుత్వం తన ఆదర్శాలకు అడ్డు పడుతున్నదని డిప్రెషన్ తో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చావు బతుకుల మధ్య ఉండడమా 
అంటే మీ నుండి మేము ఏం నేర్చుకోగలం సర్ 

మీలా ఉండాలని చాలా గర్వంగా అనుకునే మేము ఈయన్నా అన్నట్టు అయిపోయింది 
ఏమీ చేయకూడదని మిమ్మల్ని ఓ చోట కట్టిపడేయని అయినా మీరు ఉన్నచోట మీలా అక్కడ ఉన్నవారిని ఓ పదిమందిని తయారు చేయాలని ఆలోచన కదా మీకు రావలసింది 
అంతే కానీ బలహీనపడిపోతారా 

నా ఒక్కదానితోనే కష్టం అనుకుని అణగదొక్కాలి అని అనుకున్న వారికి మరో నలుగురిని నాలాంటి వారిని సృష్టించి కదా వారికి బహుమానం ఇవ్వాలి కానీ 
భయపడి పారిపోవడమా 

నీ అంతరాత్మను అడిగి చూడు 
నువ్వేం చేయాలో చెప్తుంది 
నీ గుండెను అడిగి చూడు 
నీ కర్తవ్యం ఏంటో గుర్తుచేస్తుంది 

అంతే కానీ నచ్చలేదని డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు 
అక్కడ నుండి సూసైడ్ కి మారకూడదు 

10 మెట్లు ఎక్కేసాక నిన్ను పడేస్తున్నారు అంటే వారికి తెలుసు మీరు మళ్ళీ ఎక్కేయగలరు అని 
వారికే మనపైన అంత నమ్మకం ఉన్నప్పుడు 
మనపైన మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి చెప్పండి...!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺