నెగిటివ్ థింకింగ్ విషయంలో చాలామందికి తెలీని ఓ వాస్తవం ఇది. ఒక నెగిటివ్ ఆలోచన చేసిన వెంటనే అది ఆ క్షణం, ఆరోజు మాత్రమే కాదు, చాలా రోజుల పాటు దాని ప్రభావం సబ్ కాన్షియస్‌లో కొనసాగుతూ ఉంటుంది.
అదే ఓ పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు అది ఆ క్షణం వరకూ మాత్రమే పనిచేస్తుంది. దీనికి కారణం నెగిటివ్ ఆలోచనతో పాటు ఎమోషన్ చాలా బలంగా ముడిపడి ఉంటుంది కాబట్టి బ్రెయిన్‌లో న్యూరల్ యాక్టివిటీ ఎక్కువ జరిగి అది బలంగా ముద్రించుకుపోతుంది.
అదే పాజిటివ్ థాట్స్, ఫీలింగ్స్ విషయంలో చాలామందికి పాజిటివిటీని ఓ నవ్వుతోనో, ఓ సంతృప్తితోనో కొన్ని క్షణాలు ఫీల్ కావడం మాత్రమే తెలుసు తప్పించి దాన్ని ఎక్కువ సమయం క్యారీ చెయ్యరు. సో దానికి సహజంగానే న్యూరల్ యాక్టివిటీ తక్కువ జరిగి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది.
సో నెగిటివ్ ఆలోచనలు డామినేట్ చెయ్యకుండా ఉండాలంటే.. ప్రతీ క్షణం కాన్షియస్‌గా పాజిటివ్‌గా ఉండడమే బెస్ట్ సొల్యూషన్.
ఇది ఈజీగా చెయ్యాలంటే అందరితో సరదాగా ఉండండి.. అందర్నీ ఫ్రెండ్స్‌గా ఆత్మీయంగా ఫీల్ అవండి. ఎవర్నీ శత్రువులుగా భావించకండి. అన్ని విషయాలూ చూసీ చూడనట్లు వదిలేయండి. ముఖ్యంగా లైఫ్‌లో ప్రతీదీ మీకు నచ్చినట్లు చేస్తూ ఆ ప్రతీ మూమెంట్‌నీ సెలబ్రేట్ చేసుకోండి.
Comments
Post a Comment