Skip to main content

నేటి మోటివేషన్... నువ్వు ఎవరు.. అనే ప్రశ్న తలెత్తినప్పుడు..

నువ్వు ఎవరు.. అనే ప్రశ్న తలెత్తినప్పుడు..

నేను ఇది అని పరిచయం చేసుకోవడం చాలా సందర్భాలలో నాకు కృతకంగా అనిపిస్తుంది.

నేను చేసే వృత్తి నేనా? నా ఆలోచనలు నేనా? నా అభిప్రాయాలు నేనా? నా తల్లిదండ్రులు, నా కులం, మతం, ప్రాంతం నేనా? వీటిలో ఏది నేను?

ఇదంతా కూడా అభూత కల్పన అన్నది తాత్వికంగా స్పష్టత ఉన్నప్పుడు ఓ సరిహద్దులు గీసి.. ఈ సరిహద్దుల నేను ఉన్నాను అని ప్రపంచానికి విడమరచి చెప్పే ప్రయత్నం ఎంత హాస్యాస్పదమైనది?

నిజమే నేనూ, మీరూ, మనమూ దైనందిన జీవితంలో కొట్టుకుపోతూనే ఉంటాం. అంతెందుకు, తెల్లారిలేస్తే సాయంత్రం వరకు నేనూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. కానీ ఈ జీవితంలో కొట్టుకుపోవడం, జీవితంలోనే అర్థాలు వెతుక్కోవడం, ఇక్కడే నేను ఉన్నాను అని భావించి.. సమాజంలో నా ఉనికి ఏ పరిధిలో ఉందో అర్థం చేసుకోవటానికి, దానిని విస్తరించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయటం, పరిధి తక్కువగా ఉంటే కుంచించుకుపోవడం.. ఇవన్నీ వృధా ప్రయాసలే కదా!

మనం తీసుకునే ఆహారం ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఖర్చుపెట్టాలి. అప్పుడే బుర్ర సజావుగా ఉంటుంది. అందుకోసం మనం సాగించే ప్రాపంచికమైన పనులు తప్పించి, ఆ పనుల్లో మనకు మనం కొట్టుకుపోతే, అవే మనం, ఆ వృత్తే మనం, ఆ హోదానే మనం, ఆ గొప్పదనమే మనం అని భ్రమిస్తే కొన్నాళ్ళకు ఆ భ్రమలు తొలగిపోయి మిగిలేది విచారమే కదా!

ఒక చిత్రకారుడు అందంగా బొమ్మను గీస్తూ ఉంటాడు. ఆ బొమ్మ అలా అందంగా గీయడం వల్ల అతనికి ఏం వస్తుంది అంటే.. ఓ కర్మ చెయ్యడం ద్వారా ఏదో ఒక ఫలితం వస్తుంది అని భావించడమే కర్మయోగిగా మారడానికి ఓ పెద్ద అడ్డంకి అన్నది అర్థం చేసుకో.. అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.

ఏ పని చేస్తే, ఏదో వస్తుంది అని లెక్కలేసుకుని పనులు చేసే వారు కర్మ యోగులు ఎప్పటికీ కాలేరు. వారి హృదయాలపై ఎన్నో లెక్కలు, ప్రాపంచిక విషయాలు పొరలుగా కమ్ముకుపోయి.. అదే ప్రపంచమనే భ్రాంతి కొనసాగుతూ ఉంటుంది. నీ హోదా, నీ మనుషులు, నీ ప్రపంచం దాటి నిజమైన నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. మొట్టమొదట కర్మయోగిగా మారు. అదే ఆలంబన.. ప్రాపంచిక విషయాలను త్యజించడానికి! ఆ తర్వాత నీకు నువ్వు అర్థం అవుతావు!!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺