Skip to main content

నేటి మోటివేషన్... ఇలా మీరు ఆలోచిస్తే మీ ఆనందాన్ని ఎవరూ ఆపలేరు..

ఇలా మీరు ఆలోచిస్తే మీ ఆనందాన్ని ఎవరూ ఆపలేరు..


సాధారణంగా ప్రతి ఒక్కరూ అనేక విషయాలు కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నట్టయితే.. ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో.. ఆ ఆలోచన ఫలితమే మీ ప్రస్తుత స్థితి లేదా మీ ప్రస్తుత జీవితం అవుతుంది.
 

happy life

మీ అనుభూతులు, మీ ఆలోచనలు మారడం మొదలైతే అవన్నీ కూడా మారిపోతాయి అని గమనించండి. ఎప్పుడూ కూడా సరైన ఆలోచనా శక్తితో, చైతన్యవంతమైన వ్యక్తి తనను తాను మార్చుకోగలిగితే... తన జీవన విధానాన్ని కూడా సులువుగా మార్చగలడు.

ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే. మీ పరిస్థితుల్ని మీరు మార్చుకోవాలని కోరుకుంటే మొదట మీరు చేయవలసింది మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోవడం సులువే. ఆలోచనలకే చాలా శక్తి ఉంది అందుకే గట్టిగా ఏదైనా అనుకుంటే అయిపోతుంది అని అంటారు. ఇది నూటికి నూరు పాళ్లు సత్యం. ప్రతీ ఒక్కరికి తమని తాము మార్చుకోగలిగే శక్తి వుంది. మీ ఆలోచన బట్టి మీరు మారగలరు.

చాలా మందికి ఈ సందేహం కలిగే ఉంటుంది. అది ఏమిటంటే...? ఎందుకు చిన్న ఆలోచన అంత పెద్ద దానికి కారణమవుతోంది..?, నా ఆలోచనలే నా జీవన విధానం అవుతోంది ఎందుకు..? అని సందేహం కలగవచ్చు. అదే కాకుండా ఆలోచనలు ఎప్పుడూ కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. మన వస్తువులు, మన దుస్తులు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా లైఫ్ స్టైల్ ఎందుకిలా ఉంది, నేను ఎందుకు అలా చేయలేదు, నేను ఇలా చేస్తే బాగుండేది కదా...? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో కలుగుతుంటాయి.

undefined
డెలివరీ తర్వాత ఇలా బరువు తగ్గండి..
మనం మైండ్ ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అది అనేక చోట్ల తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజు ఒక జర్నలిస్టు ఒక ఋషిని ఓ ప్రశ్న అడిగారు. ఎలా మీరు 18 ఏళ్ల నుంచి మెడిటేషన్ లో ఉంటున్నారు? , డిస్ట్రాక్షన్ లేకుండా మీరు అసలు ఎలా ఉండగలుగుతున్నారు..? అని. నిజంగా గొప్ప ప్రశ్న కదా ఇది. అయితే ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్న కి ఆ రుషి ఏమన్నారో తెలుసా... నేను ఇప్పుడు దేన్నీ నమ్మలేదు. ఎప్పటికీ నమ్మను అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ కూడా అవాక్కు అయ్యారు. అయితే మన ఆలోచనలు అన్నీ కూడా మనం ఎంతో స్వేచ్ఛగా ఆలోచించుకోవచ్చు. ఇలా చక్కగా ఆలోచించుకుంటూ మన సొంత జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు.

ఎంత మంచి ఆలోచనల్ని ఆలోచిస్తే అంత మంచి జీవితం నిర్మించుకోగలం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఎవరికి నచ్చిన ఆలోచనలు వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి హిస్టరీ అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొందరు ఎక్కువ తింటే కొందరు తక్కువ తింటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జీవన విధానం ఉంటుంది. ఏ ఒక్కరూ మరొకలా ఉండరు, ఉండలేరు. కొందరు క్రిమినల్స్ అవుతారు, కొందరు దొంగల్లా తయారు అవుతారు కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు.

కానీ ప్రతి ఒక్కరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే..? మన ఆలోచనలు మన జీవితాన్ని బాగా నిర్మిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సరిగా సక్రమంగా మంచి ఆలోచనలు ఆలోచించగలమో... అవే మన జీవితం అవుతాయి అని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇలా జరగలేదు అని చించొద్దు. అప్పుడు ఇలా ఆలోచించలేదు అందుకే అది జరగలేదు అని మీరు తెలుసుకోండి. తప్పకుండా మీరు దాని మీద దృష్టి పెట్టి దాని కోసం ఆలోచిస్తే మంచి ఫలితం కనబడుతుంద

అమెరికన్ సైకాలజిస్ట్ మరియు ఫిలోసోఫెర్ విలియం జేమ్స్ అప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే..? ఆలోచనలు పెర్సెప్షన్ అయ్యి... పర్సెప్షన్ రియాలిటీ అవుతుంది అని. ఇది నిజంగా నిజం. మనం ఏదైతే ఆలోచిస్తామో.. అది మన పర్సెప్షన్ అయ్యి ఆ తర్వాత ఆ పర్సెప్షన్ రియాలిటీ అవుతుంది. చూసారా ఎలా ఆలోచనల రియాలిటీకి దారి తీశాయి...! ప్రసిద్ధి చెందిన సైకాలజిస్ట్ చెప్పిన విధానం అర్ధమయ్యింది. మనం జీవించే ఈ ప్రపంచం కేవలం మన ఆలోచనలే ఈ నాణ్యమైన జీవితం అంతా మనం ఆలోచించే మెదడు మీద ఆధారపడి ఉంది.

మెడిటేషన్ చేయడం వల్ల ఎటెన్షన్ ఉంటుంది. అలానే మీరు ఏకాగ్రత చేయగలరు. మెడిటేషన్ వల్ల ఎంతో ప్రశాంతంగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని డీల్ చేయగలుగుతారు. పైగా మీ మెదడు కూడా మరింత బాగా పని చేయగలుగుతుంది. ఇలా మెడిటేషన్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు ఒక చోట సరిగ్గా కూర్చుని ఏకాగ్రత తో ధ్యానం చేయగలిగితే ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచడానికి కూడా మెడిటేషన్ సహాయ పడుతుంది.

అలానే గర్భిణీలు మెడిటేషన్ చేయడం వల్ల సులభంగా ప్రసవానికి సహాయపడుతుంది. బీపి ఎక్కువగా ఉన్న వాళ్లు మెడిటేషన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఎవరైనా సరే మెడిటేషన్ చేయడం వల్ల భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మెడిటేషన్ చేస్తే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

నిద్ర పట్టాలంటే కూడా మెడిటేషన్ బాగా ఉపయోగ పడుతుంది. మెడిటేషన్ వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కాబట్టి నీకు సమయం దొరికినప్పుడల్లా రోజులు ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు అయినా చేయండి. దీని వల్ల మీ ఆలోచనల పై కూడా ప్రభావం పడుతుంది మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది కూడా. దీంతో మీరు మీ జీవితాన్ని కూడా మీకు నచ్చినట్లుగా నిర్మించుకోగలుగుతారు. కనుక ఈ విషయాలని తప్పక పాటిస్తూ అందమైన మీ ప్రపంచాన్ని మీ ఆలోచనతో మీకు నచ్చినట్టుగా మార్చేసుకోండి. గుర్తుంచుకోండి ఆలోచనలే అన్నింటికీ మూలం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺