🌸జవాబు: మనకు విసుగును కల్గించే ఈగల్ల్లాంటి కీటకాలు శీతాకాలంలో అంతగా ఇళ్లలో కనిపించవు. ఇతర శీతల రక్త (cold blooded) ప్రాణుల్లాగానే కీటకాలు చాలా వరకు తమ శరీర ఉష్ణోగ్రతలను వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పడిపోగానే ఆ మార్పులకు అనుగుణంగానే కీటకాలు తమ శరీర ధర్మాలను సర్దుబాటు చేసుకోవడంతో వాటి జీవసంబంధిత ధర్మాలన్నీ (vital functions) శూన్యదశకు చేరుకుంటాయి. ఈ దశలో అవి ఒక సురక్షిత ప్రదేశాన్ని చేరుకొని గుడ్లు లేక లార్వా రూపంలో ఉండే తమ సంతానాన్ని చలి బారి నుండి కాపాడుకుని ఆ తర్వాత వచ్చే వసంత కాలంలో జీవించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాయి. గుడ్లు లేక లార్వా దశలో ఉన్న కీటకాలు తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని కీటకాల లార్వాలు శీతాకాలంలో సరస్సులలో గడ్డకట్టకుండా ఉండే నీటి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిసరాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025. మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
Comments
Post a Comment