Skip to main content

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి

ఒకానొకప్పుడు ఇటలీ దేశంలోని ఒక చిన్న పట్టణంలో ఒక చిరువ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, కానీ చండశాసనుడు. తన వడ్గీ వసూలు కోసం ఎంత నీచస్థాయికైనా దిగజారగలడు.

ఒకసారి, వడ్డీ ఇవ్వడం ఆలస్యమయినందున, ఆ వడ్డీవ్యాపారి కోపంగా ఈ చిన్న దుకాణదారు ఇంటికి వచ్చాడు. తన వడ్డీ సంగతేం చేశావని నిలదీసాడు. ఈ నెల దుకాణం సరిగా నడవనందున ఆదాయం చాలినంత లేదని, త్వరలో ఇచ్చేస్తానని నమ్మబలికాడు. ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని తన కూతురికి పురమాయించాడు. మజ్జిగతో వచ్చిన ఆ వ్యాపారి కూతుర్ని చూసిన ఈ వృద్ధ వడ్డీ వ్యాపారి దుర్బుద్ధి పుట్టి ఆ దుకాణదారుతో ‘నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే, నీ బాకీ మొత్తం రద్దు చేస్తా’నని స్పష్గం చేసాడు.

ఆ వ్యాపారి ముసలివాడిని అసహ్యంగా చూసాడు. అది గమనించిన వడ్డీవ్యాపారి, ‘సరే… నీకు రెండు అవకాశాలిస్తాను. ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. అవేంటంటే, రెండు గులకరాళ్లు ఒక సంచీలో వేస్తాను. ఒకటి నల్లది. రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచీలోనుండి ఒక రాయిని బయటకు తీయాల్సివుంటుంది. నల్లరాయి వస్తే, నీ బాకీ రద్దవుతుంది. కానీ, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం జరిపించాలి. తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. అప్పుడు నీ కూతుర్ని కూడా నాకివ్వనవసరం లేదు’ అని తేల్చాడు.

ఈ చిరువ్యాపారికి వేరే అవకాశం లేకపోవడం వల్ల ఈ ఒప్పందానికి ‘సరే’ అన్నాడు. ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడింది. ‘ఇదెక్కడి అన్యాయంరా భగవంతుడా. నాకేమిటి దారి? చివరకు ఈ ముదుసలిని, అనాకారిని పెళ్లి చేసుకోవాలా?’ అని బాధపడి, తర్వాత స్థిమితపడి పరిపరివిధాల ఆలోచించసాగింది.

ఇంతలో, ఆ వడ్డీవ్యాపారి వీరి ఇంటి ముందు ఉన్న గులకరాళ్ల దారి వద్దకు వెళ్లి, వంగి, అటూఇటూ చూసి రెండు గులకరాళ్లు తీసి సంచీలో వేసాడు. నిజానికి ఆ రెండూ నల్ల రాళ్లే. అనుకోకుండా వ్యాపారి కూతురు ముసలివాడి దుశ్చర్యను చూసింది. అయినా ఏమీ తెలియనట్లు ఓ పక్కన నిలబడిఉంది.

అప్పుడు ఆ ముసలివాడు తండ్రీకూతుళ్లను దగ్గరికి రమ్మని పిలిచాడు. ‘అమ్మాయి. ఒక రాయి తీయి’ అని సంచీని ముందుకు చాపాడు. ‘నువ్వు కూడా చూడు’ అని తండ్రిని కూడా అదిలించాడు.

ఇక్కడ ఇక ఆ ఆమ్మాయినిక మిగిలింది మూడే అవకాశాలు.
1. సంచీలోనుండి రాయి తియ్యడానికి నిరాకరించడం.
2. సంచీలోనుంచి రెండు రాళ్లు బయటకు తీసి ముసలివాడి అన్యాయాన్ని బయటపెట్టడం.
3. తెలిసి తెలిసి, తండ్రి అప్పు తీర్చడం కోసం సంచీలోనుండి ఒక రాయి బయటకు తీసి, అతన్ని పెళ్లి చేసుకుని, త్యాగం చేయడం.

ఇంతలో ఆ అమ్మాయికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. వెంటనే సంచీలో చేయిపెట్టి, ఒక రాయిని బయటకు తీసి, అదే జారిపోయినట్టుగా కిందకు దారిలో వదిలేసి ఆ ముసలివాడితో ఇలా అంది.

‘‘ అయ్యో.. నన్ను క్షమించండి. రాయి పొరపాటున జారిపోయింది. కింద అన్నీ గులకరాళ్లే. జారిపోయింది ఏదో తెలియడం లేదు కదా. అయినా పరవాలేదు. సంచీలో ఉన్నది బయటకు తీయండి. దాంతో కిందపడిందేదో తెలిసిపోతుంది కదా’’

ఆ వృద్ద వడ్డీవ్యాపారి కంగారు పడ్డాడు. మింగాలేక, కక్కాలేని పరిస్థితి. లోపల ఉన్నది బయటకు తీస్తే, కింద పడ్డది తెల్ల రాయి అని నిర్ధారించినట్లే. లేదూ నల్లరాయే అంటే, తన మోసం తెల్లారిపోతుంది. ఇక ఏం చేయలేక, ఏడ్వలేక నవ్వుతూ, ఆ దుకాణదారుడి బాకీ మొత్తం రద్దు చేసి వెళ్లిపోయాడు.

నీతి ఏంటంటే.. ‘‘ప్రతీ కష్టసమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక, మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది’’

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ