కనురెప్ప వెయ్యకుండా 10 సెకండ్లు ఈ చిత్రాన్ని చూసా....
కొద్ధి క్షణాలకు ఫోటో మసకగా కనిపించింది,
ఏమిటా అని చూస్తే కళ్ళల్లో నీళ్ళు...
ఒక్కసారిగా గుండె బరువెక్కింది.
నేటి కాలం పిల్లలు
కావాలి అని అనుకున్నది ఇస్తేనో,
కోరుకున్నవాటిని కొని ఇస్తేనో ప్రేమ ఉన్నట్టు అనుకునే రోజులు ఇవి,
ఇక తండ్రి ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరంలేదు...
కూతురు పుడితే తన తల్లి పుట్టిందని మురిసిపోయే వ్యక్తి కేవలం తండ్రి మాత్రమే..
పుట్టింది మొదలుకుని,
బట్టలు,
బంగారాలు,
ఫంక్షన్లు,
పెళ్లిళ్లు,
సారెలు ఇలా అబ్బాయికంటే అమ్మాయికే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని తెలిసి కూడా...
ఖర్చు పెట్టె రూపాయికి లెక్కచేయకుండా,
కేవలం కూతురి కళ్ళల్లో ఆనందం మాత్రమే చూస్తూ మురిసిపోతాడు...
రెక్కాడితే డొక్కాడని తండ్రి కూడా...
తన కూతురిని యువరాణిలానే చూసుకుంటాడు...
దానికి నిదర్శనమే ఈ చిత్రం...
ఆ చిట్టితల్లికి తన గుండెను బంగారు పానుపుగా చేసాడా తండ్రి...
బహుసా ఇంతకంటే గొప్పదైనా ,
విలువైన పానుపు ఎక్కడ ఉండదు, లేదు...
ఎంత ఎదిగినా తండ్రి గుండెను ఆనుకుని ఉన్న అనుభూతివేరు...
చాలామంది కూతుర్లు అదే గుండెపై తన్ని,
తండ్రి ప్రేమను మరచి,
నీచమైన కోరికలు తీర్చుకునే ప్రేమల వైపు పరుగులుపెడుతూ,
వాళ్ళ తండ్రి పరువులు బజారులో పెడుతున్నా....
నాకూతురు అందరిలాటింది కాదని ఎంతగానో మురిసిపోతాడు...(చివరికి బాధపడిన వాళ్ళు ఎందరో, చనిపోయినవాళ్ళు ఎందరో...)
అలాంటి తండ్రులను మోసం చేసే వారు చాలామందే ఉన్నారు...
అమ్మాయిలు దయతో ఒక్కసారి ఆలోచించండి నీతండ్రి నువ్వే సర్వస్వము అని జీవిస్తున్నాడు...
నీకు జీవితాన్ని ఇచ్చి,
నీ జీవితమే తన జీవితం అనుకునే నీ తండ్రిని ఎవరికోసమో బాధపెట్టావేమో...
దయచేసి ఒక్కసారి ఇప్పుడే వెళ్లి నీ తండ్రి దగ్గర క్షమాపనవేడుకో...
నీ తండ్రి ప్రేమను వృధాగా పోనివ్వకు.
పిల్లల పట్ల బాధ్యత కలిగి స్వచ్ఛమైన ప్రేమను చూపించే ప్రతీ తండ్రికి ఈ పోస్ట్ అంకితం..
Comments
Post a Comment