Skip to main content

నేటి మోటివేషన్... ఆ... కొడుకుల కోసమే ఈ పోస్ట్


గమనిక: ఇది కొంత మంది ని ఉద్దేశించి మాత్రమే.ఆ కొంత మంది లో మీరు లేకపోతె ఈ పోస్ట్ మీకు తప్పకుండ నచ్చుతుంది.

"ము* కిందకి ముప్పై ఏళ్ళు" వస్తున్నా.... అమ్మబాబు సంపాదన మెక్కుతున్న సన్నాసుల్లారా.....మీకే చెప్తున్నా వినండి.

మీరేదో పొడిచేసి చించేసి చదివిన చదువుకి సరిపడిన ఉద్యోగం రాలేదు అని ఏడుస్తూ, ప్రభుత్వాన్ని నిందిస్తూ సంవత్సరాల తరబడి రోడ్డున పడి తిరిగేటపుడు ఒక్క క్షణం ఐన ఆలోచించారా ...? 
నీ భవిష్యత్తు కోసం, నీ చదువు కోసం ఇప్పటికి నీ తండ్రి ఓ కూలివాడిలా, ముసలి ఎద్దులా పని చేస్తున్నాడని.

 ఉడుకు రక్తం... ఉడుకు రక్తం... అని విర్రవీగే ఏదవల్లారా రంగులు పూసుకునే వాళ్ళ వెనక పరిగెత్తడం కాదు.... నీ జీవితం కోసం పరిగెత్తు.
 
ఎవడో వస్తాడు,ఎదో చేస్తాడు...! ఆడొస్తే అది చేస్తాడు, ఈడొస్తే ఇది చేస్తాడు అన్నది కాదు నువ్వెవరు ? నువ్వేం చేస్తావ్ ? నీకోసం ఎం చేస్తావ్ ? ఎప్పుడైనా చేసావా ? ఆలోచన ఐన చేసావా ? 

టైం బాలేదు, టైం రాలేదు అని కూసే నువ్వు ఏ రోజు ఐన టైంకి లేచావా ? ఏ పని ఐన సక్రమంగా చేసావా ? ఇంట్లో అమ్మ పాల పాకెట్ తెమ్మంటే కదలవు......అదే నీ ఫ్రెండ్ రాత్రి 2 కి బీరేద్దాం రమ్మంటే పరుగెత్తికెళ్తావ్ ....! నీకు ఎలా వస్తుంది రా టైము?

దేవుడు నీ రాత సరిగా రాయలేదని నిందించే చవట నాయాల .....! నీ తల్లి తండ్రులే నీ దేవుళ్ళు అని ఎప్పుడైనా గుర్తించావా ? ఏనాడైనా వాళ్ళకి చేతులెత్తి మొక్కవా ? మనసారా అమ్మనాన్నతో ఒక్కసారి ఐన మాట్లాడవా?  
ఆడి బాబుకి అంత ఉంది, ఈడీకి ఇంత ఉంది, నా బాబు నాకేమి ఇచ్చాడు అని మాట్లాడే బా*** నువ్వేమి సాదిస్తానికి వచ్చావో నిరూపించుకో.....! 

ఇంట్లో నాన్నవేసుకునే మాత్రలు అయిపోతే పట్టించుకోని నువ్వు...... ఎవత్తో ఫేస్బుక్ లో పరిచయం ఐన అమ్మాయికి రీఛార్జ్ కోసం, లిఫ్ట్ ఇవ్వడం కోసం పరిగెడతావ్. తూ ....నీ  

ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ "Breakup feeling" 
అమ్మాయి మోసం చేసిందట తాగేసి, గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఊరిమీద ఆంబోతులా తిరగటం .....! 
నువ్వేదో వైట్ కాలర్ జాబ్ చేస్తావని, సుఖంగా AC లో కూర్చుని పనిచేసుకుంటావని కలలు కన్న నీ తండ్రి నిన్ను అలా చూసి ఎంత కుమిలిపోతాడో ఆలోచించావా ? 

(ఇక్కడ ఇంకో విధంగా రివర్స్ అవుతారేమో అమ్మాయే మోసం చేసింది, అమ్మాయిలే అబ్బాయిల్ని నాశనం చేస్తారు అని ...!) 
చిన్నా.......ఒకటి గుర్తుంచుకో "మోస పోయాం" అంటే అది ఎదుటివాళ్ళ తెలివి కాదు......! నీ చేతకాని తనం) 

ప్రేమించిన అమ్మాయి కోసం చస్తావా ....?
ఎవడిచ్చాడు నీకా హక్కు ? అసలు ప్రేమంటే ఏంటో తెలుసా ...?
నీకు ఉద్యోగం లేదని నిన్ను ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి.... ?

నీ చెల్లెలిని ఒక ఉద్యోగం లేనివాడికి, నీకు సరిగా నమ్మకం కుదరని వాడికి నీ చెల్లెల్ని ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా ? చెప్పు.....!

ప్రేమించడానికి మనసులు, ఇష్టాయిష్టాలు కలిస్తే సరిపోతుందని తెలిసిన నీకు పెళ్లి కి రెండు కుటుంబాలు కలవాలి, నీకు యోగ్యత ఉండాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా ?
ఎవడిస్తాడు నీకు పిల్లని ....? 
నువ్వెంటో నిరూపించుకో ....!
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు ...! కానీ అదే అదే ప్రేమని నిలబెట్టుకున్న వాడే అసలైన మగాడు.  
నువ్వు మగాడివైతే నే ప్రేమించు ...! 
ఇది పోటీ ప్రపంచం ...! ఊరికే ఏది రాదు ...!

కావలసిన దానికోసం పరిగెత్తాలి,పోరాడాలి, ప్రాధేయపడాలి...... తప్పని సరి పరిస్థితుల్లో తల వంచాలి...! అది అమ్మాయి ఐన, ఉద్యోగం ఐన ....ఇంకేదైనా ...!
 
ప్రతి ఇంటికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పాటించండి, తల్లి తండ్రుల్ని ప్రేమించండి, గౌరవించండి ...! ఇంట్లో వాళ్ళ మనసు నొప్పించి ఎన్ని గుళ్ళు తిరిగినా , ఎన్ని పూజలు,జపాలు చేసినా వ్యర్థమే ...!

గుర్తుంచుకో ఇప్పుడు కాదు ఎపుడైనా సరే నీ ఇంట్లో వాళ్ళ మనసు గెలుచుకోకుండా నువ్వు ఎం గెలుచుకున్న వ్యర్థమే.



🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాజ్యాంగములో మొత్తం ఆర్టికల్స్ వివరాలు ...

ఆర్టికల్ సంఖ్య మరియు పేరు ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం ఆర్టికల్ 16 - ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ