Skip to main content

నేటి మోటివేషన్... దేవుడు... వీధులు ఊడ్చేవాడు..



వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. 

నా బతుకు చూడు. ఎంత కష్టమో. ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," అని సవాలు విసిరాడు. దేవుడు వినీ వినీ సరేనన్నాడు. "అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. నోరు మెదపకూడదు." అన్నాడు దేవుడు. "సరే" అన్నాడు మనోడు. 

తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. "దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. 

ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు. "ఒరేయ్ దొంగా.... " అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. 

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. "దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. "నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు. 

సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. "దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను." అన్నాడు మనోడు. దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు." అన్నాడు నిష్ఠూరంగా.

 "అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను." అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా.... "ధనవంతుడు మహాపాపాత్ముడు. వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. 

ఎంత పని చేశావు నువ్వు..." అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు..


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...