ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి మిత్రులు ఉంటారు.అందరూ చెబుతూవుంటారు నాకు 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంస్టాగ్రామ్ లో 100 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని.ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి.
నిజానికి ఒక మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం.అతను నీకు మంచిని బోధించి అలవారుచుకొనేలా చేస్తాడు.ఇంక 100 మంది మిత్రులు ఉన్నా వారిలో మంచి బుద్ధి లేకపోతే వాళ్లు మనకి ఎందుకు పనికిరారు.
ఒక్క పని బాగా చేస్తారు అదే మిమల్ని నాశనం చేయడం.ఒక మంచి మిత్రుడు మిమల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తే దుర్బుద్ధి గల మితుడు నిన్ను అందాకారంలోకి తోసేస్తాడు.మరి మీరు మీ మంచి మిత్రుడ్ని ఎంచుకున్నారా!
ఆ మంచి మిత్రుడు ఎవరో మీకు తెలుసా!
ఆశ్చర్య పోకండి నిజానికి మీకంటే గొప్ప మిత్రుడు మీకు ఇంకెవరు దొరకరు.మీకు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది.మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
మీ గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు మీ కంటే మంచి మిత్రుడు మీకు ఈ ప్రపంచంలో దొరకడు.మీతో మీరే చెప్పుకోవాలి మీరు మంచి పనులు చేయాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని,కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవలని,తల్లిదండ్రులను సంతోషపెట్టాలని.
అంతేగాని మన కోసం ఎవరో రావాలి వాళ్ళు మనకు అన్ని నేరిపించాలి అంటే మనం ఎప్పటికి అభివృద్ధి చెందలేం.ఈ స్వార్థపూరిత లోకంలో నీకు ఒక మంచి మిత్రుడు తారసపడితే నీవు అదృష్టవంతునివే కానీ అలా జరగనిచో నీవు నీతోనే స్నేహం చేయి.
అప్పుడు నీవు బాధపడాల్సిన అవసరం ఉండదు.నీవు చేయాల్సిన మంచి పనులన్నీ చేయగల శక్తిని నీకు దేవుడే ప్రసాదిస్తాడు.నీలో ఉన్న నీ మంచి మిత్రుడిని ఈరోజే నిద్రలేపు అతను ఎన్ని కష్టాలు వచ్చినా నీతో ఉంది నీకు సహాయం చేస్తాడు.
ఈ నాటినుండి నీవు నీ మిత్రుడిని కనుగొంతే నీ విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది.నీలోని మిత్రుడు నిన్ను వదిలిపోడు.వాడిది కల్మషం లేని ప్రేమ .నిన్ను ఉత్తేజపరచడం వాడికి తెలుసు.ఆ కసితో నీవు ఏమైనా సాధించగలవు......!
Super best motivational quotes
ReplyDelete