Skip to main content

నేటి మోటివేషన్... జీవిత లక్ష్యం అంటే ఏమిటి ? పరమార్ధం ఏమిటి?



జీవిత లక్ష్యం అంటే – ఎ లక్ష్యం చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. పరమార్ధం.

కోరికలు లేకుండా ఉండాలంటే అసంతృప్తి లేకుండా వుండాలి.

అసంతృప్తి లో నుంచి కోరికలు పుట్టుకొస్తాయి. కోరికలనుంచి బంధాలు, బంధాలనుంచి బంధనాలు, బంధనాల నుంచి కర్మలు, కర్మల నుంచి జన్మలు. ఇంతే మానవ జీవిత చక్రం.

ఈనాడు భార్యా భర్తల మద్య ప్రేమ కరువైపోతున్నది, ఆనుకూల్యత తగ్గిపోతున్నది. దానివలన ఎన్నో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఇద్దరు ప్రక్క దోవలు పడుతున్నారు. ఇద్దరి మద్య సయోద్యత తగ్గి పోతున్నది.

మగ వాడికి అహంకారం, ఆడదానికి అభిమానం. ఈ రెంటితో కాపురాలు చేడిపోతున్నాయి.

పైగా ఈ కాలపు చదువులు. ఈ చదువుల వలన, వాతావరణం వలన మనుషులు భ్రష్టు పట్టి పోతున్నారు. చదువు సంస్కారాన్ని నేర్పాలి, కానీ అహంకారాన్ని నేర్పకూడదు. ఎవరికి వాళ్ళు నాకేమి అని అహంతో భీష్మించుకొని కూర్చుంటున్నారు. భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే భర్త బాగుండడు. చిన్న మనస్పర్ధలు కూడా చిలికి చిలికి గాలి వానై విడాకులు దాక దారి తీస్తున్నది. చిన్న వయసులోనే విడాకులు అని అంటున్నారు. ఓర్పు ఎవ్వరికీ లేదు, అనుబంధం అంటే అసలు తెలియదు, శరీరాలు ఎకమౌతున్నాయి కానీ మనసులు ఏకం కావడం లేదు. మనసులు ఏకం కాకపోతే పరిస్థితి ఇలాగే ఏడుస్తుంది. శరీరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, పై పై మెరుగులకు, షోకులకు విలువ ఇస్తున్నారు, కానీ మనసుకు విలువ ఇవ్వడం లేదు. మనసు లేని మనుగడ ఎన్నాళ్ళు వుంటుంది. ఒకటి రెండు పిల్లలు పుట్టగానే అందం కరిగి పోతుంది, ఆ తరువాత ఈసడింపులు, వత్తిడులు, బంధం, అనుబంధం లేని బ్రతుకలతో, బ్రతుకు జీవితాన్ని భారంగా నడుపుతున్నారు. మరీ ఈ corporate culture పిల్లలను సర్వ నాశనం చేస్తున్నది. ఆడ పిల్లలు దీనికి బలి అయిపోతున్నారు.

చిన్న మనస్పర్ధల వలన జీవితం అనే గోడ పగుళ్ళు ఇస్తున్నది, వెంటనే సరి చేయకపోతే ఆ గోడ ఎదోనాడు విరిగి క్రింద పడిపోతుంది. ఇదే జరుగుతున్నది ప్రస్తుత తరుణంలో. సర్దుకొని పోతాం అని ఎవ్వరిలో ఉండదు. పాత కాలంలో ఆడది ఎంతో సర్దుకొని పోయేది. కానీ ఇప్పుడు మగవాడు సర్దుకొన్నా ఆడది సర్దుకొని పోవడం లేదు. కాల మహిమ.

నీ అబ్బకు నీ అబ్బేమి అని అంటూ కొట్లాటలకు తిగుతున్నారు పెళ్లి అయిన రెండు మూడు సంవత్సరములకే. ఇది ఎందుకు జరుగుతున్నది.

ఈ కాలం నాటి అమ్మాయులు వాళ్ళ తల్లి దండ్రులు డబ్బు package ని చూస్తున్నారు, గానీ కులము,గోత్రాలు, వంశము, ప్రతిష్టలు చూడటం లేదు. Nuclear family అని ఒంటరి బ్రతుకలను చూస్తున్నారు, పెద్దలను, బంధువులను చూడటం లేదు. అత్త మామలను అసలు చూడటం లేదు. అమ్మాయి డబ్బుతో సుఖపడదు, అబ్బాయి యొక్క మనసుతో సుఖ పడుతుంది అనే ఇంగిత జ్ఞానాన్ని మరిచి పోయి ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఆడ పిల్ల తల్లిదండ్రులు. 

డబ్బు కావాలి కానీ అదే పరమార్ధం కాకూడదు. ప్రతి దానికి ఒక హద్దు వుంటుంది. పిల్లలను అతి గారాబంగా పెంచుతున్నారు, నైతిక విలువలను నేర్పించడం లేదు, individuality ఇద్దరికీ ఎక్కువై పోతున్నది. నీవెంత అంటే నీ వెంత అని కొట్లాడుకొంటున్నారు. విడిపోతున్నారు. లక్ష రూపాయలు ఇచ్చి కావలసిన సుఖం పొందవచ్చును గానీ కోట్లు ఇచ్చినా ప్రేమ దొరకదు, ఆ ప్రేమ ఒక్క నీ భార్య దగ్గరే దొరుకుతుంది. అది తెలుసుకోనేటప్పటికి వయస్సు కాస్త అయిపోతుంది. పెళ్ళిళ్ళ విషయములో ఆడ పిల్ల తల్లిదండ్రులు చాలా ఘోరాతి ఘోరముగా ప్రవర్తిస్తున్నారు.

ఒక మహా తల్లి అడిగినది నన్ను ఇలా ... ఎంత ఆస్తి వున్నది, ఎంత బంగారం పెడతారు ఇవన్నీ మీరు profile లో వ్రాయలేదు, అన్నీ పూర్తిగా చెప్పాలి కదా అని ఇంగ్లీష్ లో అడిగినది. రేపు ఏదన్నా మీ అబ్బాయికి జరిగితే అప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏమిటి”... అని ఫోన్ లో.. అడిగినది. నాకు ఒళ్ళు మండి, అమ్మా మీ అమ్మాయికి మడి కట్టుకొని తద్దినాలు పెట్టడం తెలుసా అని అడిగాను. తద్దినాలా అంటే ? ఎవరికీ పెట్టాలి ? ఎందుకు పెట్టాలి? అవి అన్నీ మా బేబీకి చేతకాదు అన్నది ఆమె .

మాకు తల్లి, మాకు తద్దినాలు, రేపు మేము పోతే మాకు కనీసం తద్దినాలు పెట్టాలి కదా అందుకని. ఎందుకంటే మీ అమ్మాయి దెబ్బకు మేము తొందరగా పైకి పోతాము కదా”... అని నేన్నాను. దెబ్బకు ఫోన్ పెట్టేసినది ఆమె.

ఇలా వున్నారు ఈ కాలం నాటి ఆడవాళ్ళూ. మగ వెధవలు ఫోన్లు ఎత్తరు, మాటలాడరు, దద్దమ్మల లాగ ఇంట్లో కూర్చుని నిద్ర పోతూ వుంటారు. అంతా ఆడవాళ్ళూ మాటలాడుతూ వుంటారు. ఇదేమి పద్ధతో నాకు అర్ధం కావడం లేదు. అమ్మా మీ వారు లేరా అని అంటే “వారు నిద్ర పోతున్నారు” అని అంటారు. నూటికి 90 శాతం ఆడ వాల్లే ఫోనులో మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ సంస్కృతి? మగవాడు ఎందుకు దిగజారి పోతున్నాడు.

ప్రతి దాంట్లో సమాన హక్కులు అని వాదిస్తూ వుంటారే ఈ కాలంనాటి ఆడవాళ్ళూ. మరి ఎందుకు ఇలా అడుగుతారు?

మా అమ్మాయి కంటే జీతం ఎక్కువ వుండాలి, మా అమ్మాయి కంటే ఎత్తు వుండాలి, మా అమ్మాయి కంటే ఎక్కువ చదువు వుండాలి, మా అమ్మాయి కంటే పెద్ద job వుండాలి, ఏ౦ ఎందుకని నీకంటే పొట్టి వాణ్ణి చేసుకో, నీ కంటే తక్కువ జీతం, తక్కువ ఉద్యోగం, తక్కువ చదువు ఉన్న వాణ్ని చేసుకో, ఏమిటి ఇబ్బంది?

పాత కాలంలో అబ్బాయలు పదోతరగతి అమ్మాయిని, చదువు లేక పోయినా, అందంగా లేక పోయినా, ఆస్తి లేక పోయినా, job లేకపోయినా పెళ్లి చేసుకొన్నారు కదా? ఇప్పుడు మీరు సమాన హక్కులు అని మగ వారితో బాటు ముందుకు వచ్చినప్పుడు, అప్పటి మగ వారి లాగ మీరు కూడా మీ కంటే తక్కువాన్ని పెళ్లి చేసుకోండి, ఏమౌతుంది.

హాయిగా ఇద్దరూ అన్యోన్నగా సంసారం చేయాలి కానీ ఈ ఆస్తులు అంతస్తులు కాదు కదా. గుండెల్లో పెట్టుకొని చూచే భర్త, కళ్ళల్లో పెట్టుకొని చూచే భార్య దొరకాలి గానీ ఇవన్నీ ఎందుకు.

అసలు భార్యా భర్తల అనుబంధం అంటే ఏమిటో ఎంత మందికి తెలుసు, అంతా అమెరికా సంస్కృతి వచ్చేసినది. ఈరోజు పెళ్లి మరుసటి ఏటికి విడాకులు. ఏమిటి ఎందుకని ఇలా జరుగుతున్నది. మల్లెపూవును వాసన చూచి ఆస్వాదిన్చాలే గానీ నలిపి పారేయ కూడదు. బార్య అంటే మల్లెపూవు లాంటిది. అతి సున్నితమైనది, కొమలమైనది. తీగ లాగ నిన్ను అల్లుకొని పోతుంది. నీవు ప్రేమగా ఒక మూర పూలు తీసుకొని వస్తే, నిన్ను అల్లుకొని తన సర్వస్వాన్ని నీకు అర్పిస్తుంది ఆడది. ఆటువంటి ఆడదాన్ని నీవు భోగ వస్తువుగా చూస్తే ఎన్నాలు భరిస్తుంది. మనసు లేని మనుగడ ఎన్నాళ్ళు సాగుతుంది, ఎప్పుడు అనుమానాలతో, అసంతృప్తితో నీవు ఆమెను వేధిస్తే ఆమె ఎక్కడికి పోతుంది.

భార్య నీవు సేద తీరే ఒక పవిత్రమైన ఆలయం, ఒక తల్లి, ఒక రంభ, ఒక మిత్రుడు, ఒక మంత్రి .. ఎంతమంది దీనిని గుర్తిస్తున్నారు, ఆచరణలో పెట్టుతున్నారు. సూటీ పోటి మాటలతో, అనరాని మాటలతో కన్ను మిన్ను గానక నీ భార్యను, అర్ధాంగిని ప్రతి క్షణం అనుమానిస్తూ వుంటే పాపం అతి కోమలమైన ఆమె గుండె ఏమౌతుంది, ఎక్కడికి పోతుంది.? ప్రేమతో నీ రెండు చేతులతో, బాహువులతో ఆప్యాయంగా రమ్మని పిలిస్తే పరిగెత్తుకొని వచ్చి, నీ గుండెల మీద వాలి తన హృదయ స్పందనతో నీకు అమృతాన్ని రుచి చూపిస్తుందే ఆడది. అటువంటి మనిషిని నీవు మాటలతో, చేతలతో కొట్టి, తిట్టి హింసించి, పెళ్లి అంటే భయం, సంసారం అంటే రోత కలిగిస్తే ఎలా? కట్టుబాట్లు మనమే పెట్టుకొన్నాము, మనమే దాటేస్తే ఎలా? నీ భార్య ఎదురు తిరిగితే, నీ కొడుకు చేయి పైకి ఎత్తితే, ఏమి చేస్తావు? నీ గౌరవం ఏమౌతుంది. ఆలోచిన్చినావా? నీ భార్య నీకు తనుకు తానుగా బద్దురాలు అయి నిన్ను గౌరవిస్తున్నది, నీ సుఖమే తన సుఖం అని ఆలోచిస్తున్నది, అందరినీ వదలి నీ ఇంట అడుగు పెట్టినది నీ మీద నమ్మకంతో అటువంటి నీ భార్యను మూడ్నాల్ల ముచ్చటగా వదిలేస్తావా, విడాకుల పేరుతో దూరం చేస్తావా ? అసలు నీకు చేతులు, నోరు ఎలా వస్తుంది అలా అనడానికి. నీ బిడ్డలకు తల్లి అయి, నీ వంశాన్ని, నీ గోత్రాన్ని వృద్ది చేస్తూ నీ ఇంటికి పనిమనిషిగా, నీకు వంట మనిషిగా జీత౦ తీసుకొని నౌకరు లాగా శెలవు లేని బానిస లాగ చచ్చేదాకా పనిచేసేది నీ భార్య.

అటువంటి మనిషిని నీవు విడాకుల పేరుతో నీ ఇంటినుంచి గెంటేస్తావా నిర్ధాక్షణ్యముగా.

లోకంలో బిడ్డలు ఎందరు తల్లి దండ్రి లేకుండా వాళ్ళ ముద్దు ముచ్చట, ఆలనా పాలనా లేకుండా పెరుగుతున్నారు.

అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాత రెండూ బిడ్డలకు కావాలి. అమ్మ దగ్గర నుంచి ప్రేమను, నాన్న దగ్గర నుంచి క్రమశిక్షణ ను రెండూ నేర్చుకొంటారు పిల్లలు. ఏది లేకపోయినా ఆ జీవితం వ్యర్ధమే, ఏదో లోటు, ఏదో వెలితి. చివరి దాకా బాధ. సమాజం లో ఓ ఉన్నతమైన పౌరిడిగా తీర్చబడలేడు.

భార్యాభర్తలు వయసులో వున్నప్పుడు విడాకులుతో విడిపోతారు కారణం ఏదైనా గానీ, ఆ తరువాత వయస్సు మల్లెకొద్దీ జీవితం చాలా బరువుగా సాగుతుంది, విసుగుతో జీవితం దుర్భారమౌతుంది. ఒంటిరి జీవితం గడపటం చాలా చాలా కష్టం. నా అనేవాళ్ళు తోడు వుండరు. పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితాలతో తలమునకలు అయిపోతారు. నిన్ను పట్టించుకొనే వాడే వుండడు. నీ దగ్గర కూర్చొని నీతో కబుర్లు ఆడే నీ మనిషి నీకు ఉండదు. నీ బాధ పంచుకొనే దానికి, నీ కోసం ఒక కన్నీరు బొట్టు కార్చుటకు ఎవ్వరూ నీ చెంతన వుండరు. అప్పుడు నీవు చేసిన తప్పులు అన్నీ నీకు గుర్తుకు వచ్చి నిన్ను బాధిస్తాయి.

ఇక తల్లి లేక తండ్రి లేక పెరిగే బిడ్డల పరిస్థితి ఇంకా ఘోరం. ఎవరు ఇచ్చారు మీకు అధికారం పిల్లలను అన్యాయం చేయమని, మీకర్మలకు మీ తగువులకు పిల్లలు ఎందుకు బాధ్యత వహించాలి, వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి.

నాన్న లేక పోయినా అమ్మ లేక పోయినా ఎ ఒక్కరు లేకపోయినా ఆ బిడ్డలు అనాధాలే. తోటి పిల్లల యొక్క తల్లిదండ్రులను చూచి ఆ పసి పిల్లల మనసు ఎంత గాయపడుతుందో తెలుసా ?

అమ్మా నాన్న ఏడి అని అడిగితే ఏమి చెబుతారు సమాధానం ? ఎవర్ని చూపిస్తారు ఆ పసి బాలుడకు. ఈ రోజు నీ దగ్గర డబ్బు వున్నది అని ఆయాలను పెడుతావు, కానీ అమ్మ ప్రేమ తెలిసేది ఎలా. తల్లి తన చనుబాలతో ప్రేమను పంచుతుంది పిల్లలకు. అక్కడి నుంచి పిల్లవాడికి తల్లి స్పర్శ. ప్రేమ, అనురాగం, ఆప్యాత మొదలు అవుతుంది.

దెబ్బ తగిలినప్పుడు “నాన్నా” అని ఒడిలోకి తీసుకొని గుండెలకు తనివితీరా హత్తుకొని లాలించి పాలిస్తుంది. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డకు పడుతుంది. అప్పడు తెలుస్తుంది నీకు తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, ప్రేయసి ప్రేమ.

ఆ అమ్మే లేని వాడికి ఏమి తెలుస్తుంది ఈ ప్రేమను గురించి, సమాజంలో రాక్షసులుగా, కిరాతకులుగా మారి మరలా ఆడపిల్లలను మోసం చేసి, విడాకులు ఇవ్వడానికా? దేనికి ఆలోచించండి.

ఓ యువతీ యువకులారా, ఓ భార్యాభర్తలారా వివేకముతో ఆలోచించండి. మీ సంసారములను చేతులారా నాశనము చేసుకోకండి మీ అభిమానములతో. మీ బిడ్డలను ఒంటరి వాళ్ళను చేయకండి. వాళ్లకు అమ్మా నాన్న ఇద్దరూ కావలి.

తల్లి ప్రేమ తెలియక తల్లడిల్లే పిల్లలు ఎందఱో. అమ్మ ప్రేమ కోసం 60 ఏండ్లలలో కూడా బాధ పడే మనుషులు ఎందఱో.

చేతులారా మీరు తెగ తెంపులు చేసుకోకండి, చేతకాక పోతే మీ స్నేహితుల సహాయం తీసుకోండి.

తల్లులు ఏమీ తక్కువ కాదు, అహంకారంతో, చక్కటి జీవితాన్ని, సంసారాన్ని కాలదన్నుకొని, భర్తను, బిడ్డలను వదులుకొని అభిమానంతో బయటకు వెళ్ళిన మహా సాధ్వీమణులు కూడా ఈ లోకంలో చాలా మంది వున్నారు.

మరి ఆ తల్లికి పుట్టిన బిడ్డలు ఎంతగా అల్లాడి ఉంటారో కదా అమ్మ పాల కోసం అమ్మ ప్రేమ కోసం.

 

అమ్మా, అమ్మా, అమ్మా అని అరిచి, ఏడ్చి, అలసి, సొలసి పోయిన లక్షలాది బిడ్డలెందరో కదా!

ఆలోచించండి మేధావులారా ! విడాకులు ఇవ్వకండి, మీ పిల్లలను అన్యాయం చేయకండి.

ఇంకా వ్రాయాలంటే, చెప్పాలంటే చాలా వుంది, కానీ చెప్ప లేక పోతున్నాను, వ్రాయ లేక పోతున్నాను.

కన్నీళ్లు అడ్డు వస్తున్నాయి . ప్రేమించండి. ప్రేమించండి ప్రేమించండి.

మనిషిని ప్రేమించలేనివాడు భగవంతున్ని కూడా ప్రేమించలేడు. మూర్ఖంగా ఆలోచించకండి. ప్రేమే గొప్పది.

--

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺