Skip to main content

కొత్త అలవాట్లు, పాత ఆలోచనలు మన నుంచి దూరంగా పెట్టడం వల్ల జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతాం

🌿1. ఇది ఇంతా అవసరమే.. అనుకోండి.

శరీర ఆరోగ్యానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించడం, జిమ్‌కి వెళ్లడం, ఇంట్లో రాత్రి భోజనం చేయడం మొదలైన వాటితో పాటు, శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం, సినిమా లేదా షో చూడటం, స్నేహితులను కలవడం మొదలైన చేయడం ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

🌿2. సాకులు వెతక్కండి.

సాధారణంగా, ఏ పనినైనా చేయాల్సి వస్తే.. నేను చేయలేనని.. ఇప్పుడు నా వల్ల కాదని.. "నేను అలసిపోయాను," "నాకు సమయం లేదు," "నేను రేపు చేస్తాను," వంటి సాకులు చెపుతుంటాం. 

👉ప్రతి దానికి ఇతరులను నిందించడం మానేసి, మీ జీవితం, మీ పనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, మీ స్వంత మార్గానికి బాటలు వేయండి.


🌿3. వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపండి.

ఎవరి గురించో ఎవరో చెపుతుంటే మీరు చెవి వేయకండి. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూసే ధోరణి చేటు తెచ్చిపెడుతుంది. 

👉ఉచిత సలహాలను ఇవ్వడం, తీసుకోవడం లాంటివి అదుపులో ఉంటే మంచిది. ఎదుటివారు చెప్పింది బహుశా అసత్యం, అసంబద్ధం కావచ్చనేది ఆలోచించండి. 


🌿4. వ్యాయామం చేయండి.

రోజూ ఉదయాన్నే వ్యాయామానికి వెళ్లండి. ఈ అలవాటు ఒత్తిడిని దూరం చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. 
👉వ్యాయామం చేసిన తర్వాత, ఆలోచనలు మరింత స్థిరంగా ఉంటాయి. మనస్సు పదునుగా ఉంటుంది. ఆందోళన స్థాయి మునుపటి కంటే తక్కువగా ఉంటుంది. 


🌿5. పరధ్యానాలను వదిలేయండి.

తరచుగా సోషల్ మీడియాను వాడటం, ఫోన్ చూడటానికి ఓ టైం అంటూ ఉండకపోవడం వాటి కోసం ఎక్కువ సమయం గడుపుతున్నట్టు  గమనించినట్లయితే, ఈ అలవాట్లను దూరం చేసుకోవడానికి మరో వ్యాపకాన్ని ఎంచుకోండి. అది మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండటంతోపాటు అలవాటైన ఫోన్ కంటే కూడా ఉత్సాహంగా ఉంచేదిగా చూసుకోండి. 


🌿6. బాధితుడిగా ఆలోచించకండి.

జీవితంలో జరిగే చాలా వాటికి మనం కారణం కాదనే స్పృహతో ఉండటం చాలా అవసరం. 

👉మన జీవితానికి మనమే కారణమనే ఆలోచనలో ఉండటం అవసరం. దీనికి ఇతరులను నిందించడం మానేయండి. 


🌿7. భయాన్ని ఎదుర్కోండి.

👉గొప్ప విజయాన్ని సాధించిన ఏ వ్యక్తి అయినా మొదట విఫలాన్ని చూడకపోడు.. దానికే నిరాశ చెంది ఏదో కోల్పోయినట్టు ఉండిపోవాల్సిన పనిలేదు. 

👉కొన్నిసార్లు కొత్త ప్రయత్నం చేయడానికి భయపడితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరగకుండా ఆపినవాళ్ళవుతారు.🍁

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺