Skip to main content

నేటి మోటివేషన్... మీ పిల్లల కోసం


దయచేసి మీరూ చదవండి......... మీ పిల్లలనూ చదివేలా చేయండి.......... ప్లీజ్........

ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.
చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.

డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?

యువకుడు: లేదండీ! మా నాన్నగారే అన్ని ఫీజులు కట్టెవారు.......

డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?

యువకుడు: బట్టలు ఉతికే వృత్తినే చేస్తూ నన్ను చదివించారు.......

డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.

యువకుడు: తన చేతులను చూపించాడు........అవి చాలా సున్నితంగా నాజూకుగా ఉన్నాయి.

డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు బట్టలు ఉతకడంలో సహాయపడ్డావా?

యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకుని
మంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.

డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి .నాదొక చిన్న
విన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.

యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.

డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రుల చేతులను శుభ్రంగా
కడిగిరా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

యువకుడు: అలాగే సర్.

ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల చేతులను శుభ్రం చేయడానికి వారి చేతులను తన చేతులలోకి
తీసుకున్నాడు.......వారి చేతులను చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....ఆ చేతులు
కాయలుగట్టి.........రక్తం కారుతూ.......గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......
ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు
ఉతకవలసిన బట్టలను తానే ఉతికి ఆరేసాడు...

మరుసటిరోజు ఆఫీసుకు కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు....

" మీరు నా కళ్ళు తెరిపించారు సర్! నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు
మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"

దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......

" ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థం
అవుతాయి.......కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే
మా ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటి
చిన్న పరీక్ష పెట్టడం జరిగింది... నీవే ఈ ఉద్యోగానికి అర్హుడవు "

కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా
అసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగా
చదువుకుని ప్రయోజకులు కండి,,,,,,ఆల్ ది బెస్ట్..


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

  1. Well speech on today wards sir thank u so much sir👍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺