ఆచార్య చాణక్యుడు మనిషి ఎప్పటికీ మరచిపోకూడని
కొన్ని విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. నేటికీ ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషి జీవితాన్ని విజయవంతం చేసేందుకు ప్రేరణకల్పిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
🌿ఒత్తిడి లేకుండా జీవించడం
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నించాలి.
👉ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సైతం ఒత్తిడి తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఒత్తిడి లేకుండా ఉండటం ద్వారా మనిషి ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు.
👉ఎప్పుడూ తనను తాను నమ్ముకుంటే ఒత్తిడిని జయించవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు.
🌿సమస్యలతో ధైర్యంగా పోరాడటం
👉చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి అన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి.
👉వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా వ్యక్తికి విజయాన్ని అందిస్తుంది.
🌿పరధ్యానంగా ఉండవద్దు
👉మనిషి ఎప్పుడూ కూడా పరధ్యానంగా, నిరుత్సాహంతో, నిరాశ చెందుతూ ఉండకూడదు.
👉కష్టాలను ఎదుర్కోవాలనే దృఢ సంకల్పం కలిగివుండాలి.
👉మనిషి తన ప్రాముఖ్యతను తాను గుర్తుచేసుకోవాలి.
👉ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని పండితులు చెబుతుంటారు.
🌿నిజాయితీగా ఉండండి
👉జీవితంలోని అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి.
👉ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
👉చెడు అలవాట్లు లేదా అభ్యంతరకర ప్రవర్తనతో ఎవరినీ బాధపెట్టవద్దు.
👉నిజాయితీపరుడు తప్పుడు పనులలో భాగస్వామ్యం వహించడు.
👉నిజాయితీ అనేది ఏ నియమాన్నీ, ఏ చట్టాన్నీ ఉల్లంఘించదు.
👉ఏ చిన్న పనిలోనూ నిర్లక్ష్యం తగదు.
🌿ప్రతికూల ఆలోచనలకు దూరం
చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి పని విజయవంతం కావడానికి సానుకూల ధోరణి కలిగి ఉండటం చాలా ముఖ్యం.
👉మనిషి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అప్పుడే అతను విజయానికి బాటలు వేసుకోగలుగుతాడు.
👉ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మీ దృష్టిని మార్చుకోండి.
👉యోగా, ప్రాణాయామం చేయండి,
👉మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి
👉భగవంతుని ధ్యానం చేయండి,
👉నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి.
👉బద్ధకాన్ని తరిమికొట్టండి.
👉ఏదో ఒక ఉపయోగకరమైన పనిచేస్తూ ఉండండి.
ఈ విధంగా వ్యవహరించినప్పుడే మనిషి ప్రతికూలతలకు దూరంగా ఉండగలుగుతాడని ఆచార్య చాణక్య తెలిపారు.
Comments
Post a Comment