Skip to main content

నేటి మోటివేషన్... ఓ జీవిత సత్యం



 ఓ కొడుక్కి…తండ్రి కొన్ని మేకులు ఇచ్చి….నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు అని అన్నాడు.!
       మొదటి రోజు 20, తర్వాతి రోజు 15, మూడవ రోజు 10 ఇలా…తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు. మేకులు అయిపోగానే…కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు.

 ఓ …అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా..అన్నాడు తండ్రి కొడుకుతో…!? ఆ… అయితే…. రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్ అన్నాడు కొడుకుతో తండ్రి… తండ్రి చెప్పినట్టే…కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు.

ఏమయ్యిందిరా? అని అడిగాడు కొడుకుని తండ్రి….. గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న అన్నాడు కొడుకు..

మరి గోడ ఎలా ఉందిరా? మేకులైతే తీసేశాను కానీ..వీటి వల్ల గోడలకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్నా అన్నాడు కొడుకు.

 అప్పుడు తండ్రి..కొడుకు తో..” చూశావా.. మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావ్.! తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసినా రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి….అంటే మనకి చాలా మంది మీద కోపం వస్తుంది, ఆ కోపంలో వాళ్ల మనస్సును గాయపరుస్తాం…( అంటే మేకులు కొడతాం), తర్వాత సారీ చెప్పేస్తాం ( అంటే కొట్టిన మేకులు తీసేస్తాం), కానీ సారీ చెప్పనంత మాత్రన వారి మనస్సు అయిన గాయం (అంటే రంధ్రాలను ) మాత్రం పూడ్చలేం.

అందుకే మాట-తూటా లాంటిది, ఆచితూచి మాట్లాడుదాం, ఇతరులను నొప్పించకుండా మాట్లాడుదాం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ పెరిగితే ఏమి చేయాలి

ప్రధానోపాధ్యాయులకు/ప్రధానాచార్యులకు తెలియజేయునది. 10వ తరగతి పాసైన కొంతమంది విద్యార్థులకు IIIT అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వారి మార్కులు మారి పెరగడం జరిగింది Already అప్లై చేసిన విద్యార్థులకు మరలా తిరిగి అప్లై చేసే అవకాశం లేదు కావున అట్లాంటి విద్యార్థుల కోసం కన్వీనర్ IIIT వారికి అడ్రస్ చేస్తూ గతంలో అప్లై చేసిన అప్లికేషన్ నంబర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ ను రాస్తూ మార్కులు పెరిగిన తర్వాత కొత్తగా వచ్చిన మార్కులు మెమోని ఈ రిక్వెస్ట్ లెటర్ తో పాటు అటాచ్ చేసి ఈ క్రింది తెలిపిన రెండు Mail id లకు Convener Admissions RGUKT-AP •   convener.admissions@rgukt.in Assistant Registrar, Academics - RGUKT Nuzvid •   ar.academics@rguktn.ac.in  మెయిల్ చేసినట్లయితే పెరిగిన మార్కులను పరిగణలోకి తీసుకొని IIIT అవకాశం వచ్చే విధంగా కన్వీనర్ గారు చర్యలు తీసుకుంటారు. కావున ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ/ప్రధానాచార్య మిత్రులు గమనించవలసిందిగా కోరుతున్నాం. IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ లో పెరిగితే...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Latest job notifications