Skip to main content

నేటి మోటివేషన్... తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం



నాన్న మీ కాలంలో
1. ఇంత టెక్నాలజీ లేదు..
2.విమానాలు లేవు..
3.. ఇంటర్నెట్ లేదు..
4.. TV లు లేవు..
5.. కంప్యూటర్లు లేవు..
6.. ఏసీ లు లేవు..
7.. లగ్జరీ కార్ లు లేవు..
8.. మొబైల్ ఫోన్ లు లేవు... మీరెలా బతికారు...  

*దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే*...........  

మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే 
1. ప్రార్ధన లేకుండా..
2. మర్యాద లేకుండా 
3. ప్లానింగ్ లేకుండా 
4. క్రమశిక్షణ లేకుండా..
5. పెద్దల ఎడ గౌరవం లేకుండా..
6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..
7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..
8. Morals లేకుండా... ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో... 
మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము...

మేము మీలాగా... 
1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..
2. పాఠశాల వేళలు అయినా 
తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము 
TV లు చూడలేదు...
3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక 
నిజమైన స్నేహితులతో గడిపాము..
4. దాహము వేస్తె కుళాయి నీరు తాగాము.. 
బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..
5. ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా 
మాకెప్పుడూ జబ్బులు రాలేదు..
6. మూడు పూటలా అన్నం తిన్నా 
మాకు ఊబకాయం రాలేదు...
7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా 
మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..
8. సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము,, 
బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, 
పండుగలు కలిసి చేసుకున్నాము..
9. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..
10. మావి black and వైట్ ఫొటోలే అయినా 
వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు..... 

మాది జీవితాన్ని చదివిన తరము.. 
బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం... 
మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు..... 
అయినప్పటికీ.. 
మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము... 
మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము..... 

అందుకే మా విన్నపము ఏమంటే.. 
*మీ జీవితాలనుండి, ఈరోజు భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...